NTPC Recruitment: ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
NTPC Recruitment: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వ శాఖకి చెందిన ఈ సంస్థలో మొత్తం 15 పోస్టులను..
NTPC Recruitment: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టీపీసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వ శాఖకి చెందిన ఈ సంస్థలో మొత్తం 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 15 ఖాళీలకు గాను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (హైడ్రో) మెకానికల్ (05), ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (హైడ్రో) సివిల్ (10) భర్తీ చేయనున్నారు.
* ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (హైడ్రో) మెకానికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
* ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (హైడ్రో) సివిల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత పొందాలి. పని అనుభవం తప్పనిసరి. వయసు 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఆన్‌లైన్ స్క్రీనింగ్/ షార్ట్ లిస్టింగ్ /సెలక్షన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60000 వరకు చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 16-11-2021న ప్రారంభమవుతుండగా 30-11-2021తో ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Throwback photo: గల గలా మాట్లాడే జలపాతం ఈ యాంకరమ్మ.. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా.?
Unstoppable with NBK : బాలయ్య టాక్ షో నెక్స్ట్ గెస్ట్ ఆమేనా.. ? చక్కర్లు కొడుతున్న వార్త..
Unstoppable with NBK : బాలయ్య టాక్ షో నెక్స్ట్ గెస్ట్ ఆమేనా.. ? చక్కర్లు కొడుతున్న వార్త..