NITTTR Jobs 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం.. పూర్తి వివరాలివే..

|

Aug 25, 2022 | 7:16 AM

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన చండీగఢ్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ టీచర్స్‌ ట్రెయినింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (NITTTR Chandigarh).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి (Project Assistant Posts) అర్హులైన..

NITTTR Jobs 2022: ఇంజనీరింగ్‌ నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం.. పూర్తి వివరాలివే..
Nitttr Chandigarh
Follow us on

NITTTR Chandigarh Project Assistant Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన చండీగఢ్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ టీచర్స్‌ ట్రెయినింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (NITTTR Chandigarh).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి (Project Assistant Posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ పోస్టులకు సివిల్‌/ టెక్నాలజీ/ఆర్కిటెక్చర్‌ స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులకు మాస్టర్స్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ లేదా టెక్నాలజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం రెండేళ్లపాటు అనుభవం కూడా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 2, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష సెప్టెంబర్‌ 24, 25 తేదీల్లో నిర్వహిస్తారు. రాత పరీక్ష అనంతరం సెప్టెంబర్‌ 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైనవారికి నెలకు 20,000ల నుంచి రూ.31,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.