AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bengaluru: ఫేక్‌ స్వామీజీ రాసలీలలు! తీర్థంలో మత్తుమందిచ్చి ఐదేళ్లుగా యువతిపై అత్యాచారం.. ఆపై వీడియోతీసి..

దొంగ బాబాలు, స్వామీజీల వలలో చిక్కుకుని అమాయక ప్రజలు తమ ధన, మాన, ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు కోకొల్లలు. భక్తుల నమ్మకాలను అవకాశంగా చేసుకుని వారిపై చేస్తున్న అకృత్యాలు..

Bengaluru: ఫేక్‌ స్వామీజీ రాసలీలలు! తీర్థంలో మత్తుమందిచ్చి ఐదేళ్లుగా యువతిపై అత్యాచారం.. ఆపై వీడియోతీసి..
Fake Swamiji
Srilakshmi C
|

Updated on: Aug 24, 2022 | 1:33 PM

Share

Bengaluru Fake Swamiji harassement for 5 years: దొంగ బాబాలు, స్వామీజీల వలలో చిక్కుకుని అమాయక ప్రజలు తమ ధన, మాన, ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు కోకొల్లలు. భక్తుల నమ్మకాలను అవకాశంగా చేసుకుని వారిపై చేస్తున్న అకృత్యాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఓ యువతి వివాహం జరగడంలేదని ఓ దొంగ స్వామీజీని ఆశ్రయిస్తే తీర్థంలో మత్తు మందు కలిపి ఆమెకు తెలియకుండా ఐదేళ్లుగా అత్యాచారం పాల్పడుతున్నాడని సంఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళ్తే..

వివాహం కావట్లేదని పరిహార మార్గం కోసం కుటుంబ సభ్యుల సూచనల మేరకు ఐదేళ్ల కిందట ఆనందమూర్తి అనే నకిలీ స్వామీజీని బాధితురాలు కలిసింది. మత్తు మందు కలిపిన పానీయం పూజ చేస్తున్న సమయంలో ఇచ్చేవాడు. అనంతరం స్పృహ తప్పిన తనపై ఆనందమూర్తి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. అతని భార్య లత తన ఫోన్‌ కెమెరాతో రికార్డు చేసి, ఆ వీడియోను అడ్డుపెట్టుకుని తనపై వరుసగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని వాపోయింది. తనకు వస్తున్న పెళ్లి సంబంధాలను సైతం ఆనందమూర్తి, అతని భార్య చెడగొడుతున్నట్లు తెల్పింది. ఇదే క్రమంలో గత వారం వచ్చిన సంబంధాలను కూడా చెడగొట్టారని బాధితురాలు తెల్పింది. ఈ విషయం బయటికి చెబితే వీడియోలు, చిత్రాలను ఇంటర్‌నెట్‌లో ఉంచుతామని బెదిరిస్తున్నారని లాయర్‌ జ్ఞానేశ్‌కు వివరించింది. బాధితురాలు ఆగస్టు 23న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆనందమూర్తిపై కేసు ఫైలు చేసి దర్యాప్తు చేపట్టారు.