NIACL: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ కొలువులు.. ఎంపికైతే నెలకు రూ.40 వేల జీతం
ముంబైలోని ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు..
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్… దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐఏసీఎల్ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ సంక్షిప్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 500 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జనవరి 1, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 17, 2024 నుంచి ప్రారంభమవుతుంది.
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా కోర్సులో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి దరఖాస్తు చేస్తున్న రాష్ట్రం లేదా యూటీ ప్రాంతీయ భాషపై పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి డిసెంబర్ 1, 2024 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్‌లో నేరుగా దరఖాస్తులు నింపవచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఎంపికైన వారికి నెలకు సుమారు రూ.40,000 వరకు జీతంగా చెల్లిస్తారు. ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ఇతర అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తనిఖీ చేసుకోవచ్చు.
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.