భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలోనున్న నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్.. ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/గ్రాడ్యుయేషన్, ఫిజిక్స్/మెటియోరాలజీ/అట్మాస్పిరిక్ సైన్స్‌లోమాస్టర్స్ డిగ్రీ/డాక్టోరల్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 11, 2022వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన అభ్యర్ధులకు నెలకు రూ.20,000ల నుంచి రూ.67,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.