NBCC Recruitment: నేషనల్ బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NBCC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 81 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో జూనియర్ ఇంజనీర్ (సివిల్)–60,జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)–20, డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్ ఇంజనీరింగ్)–01 పోస్టులు ఉన్నాయి.
* జూనియర్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.
* జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమాలో ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థలు వయసు 28ఏళ్లు మించకుండా
* డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్ ఇంజనీరింగ్) ఖాళీలకు అప్లై చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 46 ఏళ్లు మించకుండా ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* జూనియర్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 14-04-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: GIG Workers: గిగ్ వర్కర్లు అంటే ఎవరో తెలుసా.. వారు ఆదాయపు పన్ను కట్టాలా..
Travel Dishes: టూరిస్టు ప్రదేశాలను సందర్శించేప్పుడు ఈ వంటకాలను ఎంజాయ్ చేయండి..