NIMR Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మలేరియా రిసెర్చ్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.

| Edited By: Anil kumar poka

Sep 20, 2021 | 8:44 AM

NIMR Recruitment 2021: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మలేరియా రిసెర్చ్‌ (ఎన్‌ఐఎమ్‌ఆర్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా కాంట్రాక్ట్ విధానంలో పోస్టులను..

NIMR Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మలేరియా రిసెర్చ్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.
Follow us on

NIMR Recruitment 2021: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మలేరియా రిసెర్చ్‌ (ఎన్‌ఐఎమ్‌ఆర్‌) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా కాంట్రాక్ట్ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. భారత ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 08 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో రిసెర్చ్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌), ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌, ఎంటీఎస్‌ వంటి పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టులో ఐటీఐ, ఇంటర్మీడియట్‌, డీఎంఎల్‌టీ, గ్రాడ్యుయేషన్‌, మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థులకు సంబంధిత రంగలో పని అనుభవం తప్పిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15,850 నుంచి రూ. 35,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
* అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Skin Problems-Ayurveda Tips: సాధారణ చర్మవ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా సైడ్‌ఎఫెక్ట్స్‌లేని ఈ సింపుల్ చిట్కాలు మీకోసం

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.

Ganesh Immersion 2021: ఓ భక్తుడి వినూత్న ప్రయత్నం.. ఇలా కూడా వినాయక నిమజ్జనం చేస్తారా అంటూ షాక్ అవుతున్న జనాలు..!