ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఉద్యోగాలు పోనున్నాయా.? అమెరికా వర్సిటీ నివేదికలో ఆసక్తికర విషయాలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో అన్ని రంగాల్లో ఈ టెక్నాలజీ అనివార్యంగా మారింది. ఈకామర్స్ మొదలు, వైద్య రంగం వరకు అన్నింటిలో కృత్రిమ మేథను ఉపయోగిస్తున్నారు. దీంతో సహజంగానే ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. నలుగురు మనుషులు చేసే పనిని ఒక ఏఐ టూల్ చేయడంతో భారీగా ఉద్యోగాల్లో..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ఎక్కడా చూసే ఇదే వినిపిస్తోంది. కృత్రిమ మేథ ప్రపంచ గతిని మార్చడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. మనిషి చేసే అన్ని పనులు, ఆ మాటకొస్తే మనిషి చేయలేని పనులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో అన్ని రంగాల్లో ఈ టెక్నాలజీ అనివార్యంగా మారింది. ఈకామర్స్ మొదలు, వైద్య రంగం వరకు అన్నింటిలో కృత్రిమ మేథను ఉపయోగిస్తున్నారు. దీంతో సహజంగానే ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. నలుగురు మనుషులు చేసే పనిని ఒక ఏఐ టూల్ చేయడంతో భారీగా ఉద్యోగాల్లో కోతలు పడనున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏఐ రాకతో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని, ఇప్పటికే ఈ దిశగా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
అయితే ఇదే విషయమై అమెరికాకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ.. ‘మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)’ ఓ అధ్యయనం నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అమెరికాలో ఉద్యోగుల స్థానంలో ఏఐని తీసుకురావడం సాధ్యమేనా? అనే అంశంపై ఎంఐటీ తాజాగా పరిశోధన చేసింది. అయితే ఇప్పటికిప్పుడు ఏఐ కారణంగా ఉద్యోగాలకు వచ్చిన నష్టం లేదని అధ్యయంలో తేలింది. చాలా సంస్థలకు ఏఐని నియమించుకోవటం కంటే ఆ స్థానంలో ఉద్యోగులను కొనసాగించటమే మంచిదనే ఆలోచనలో ఉన్నట్లు తేలింది. కొన్ని దశాబ్ధాల వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అధ్యయనంలో పేర్కొన్నారు.
‘కంప్యూటర్ విజన్’ అనే ఏఐ ఆటోమేషన్ సిస్టమ్‌పై అధ్యయనం చేసిన తర్వాత ఈ నిర్ధరణకు వచ్చారు. కంపైనీలో కేవలం 23 శాతం మంది ఉద్యోగులను మాత్రమే ఏఐతో రీప్లేస్ చేయడం కంపెనీలకు కలిసొస్తుందని అధ్యయనంలో తేలింది. ఏఐ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటు ధరలోకి రావడానికి దశాబ్ధాలు పడుతుందని పేర్కొన్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఏఐ కారణంగా ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపకపోయినప్పటికీ, జాబ్ మార్కెట్‌లో మార్పులకు మాత్రం ఏఐ కచ్చితంగా కారణమవుతుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన నీల్ థామ్సన్ వెల్లడించారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..