AP Medical Jobs 2025: వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎవరు అర్హులంటే?

వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఔట్‌ సోర్సింగ్ విధానంలో ఖాళీగా ఉన్న 60 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ నియామకాల కోసం అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యుగంధర్ సూచించారు..

AP Medical Jobs 2025: వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎవరు అర్హులంటే?
Krishna District Medical Recruitment Notification

Edited By:

Updated on: Dec 23, 2025 | 9:29 PM

కృష్ణాజిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఔట్‌ సోర్సింగ్ విధానంలో ఖాళీగా ఉన్న 60 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ నియామకాల కోసం అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యుగంధర్ సూచించారు. నోటిఫికేషన్ ప్రకారం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో UPHCs గ్రేటు ఫార్మస్టిక్ ఒక పోస్టు, గ్రేట్ టు ల్యాబ్ టెక్నీషియన్ రెండు పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ నాలుగు పోస్టులు, లాస్ట్ గ్రేట్ సర్వీసెస్ 10 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్లలో గ్రేటు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 12, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లి పోస్టులు 16, శానిటరీ అటెండర్, వాచ్మెన్ 10 పోస్టులు భర్తీ చేయనున్నారు.

అర్హత, వయోపరిమితి, ఎంపిక విధానం వంటి పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకొని నోటిఫికేషన్ లో పేర్కొన్న అవసరమైన ధ్రువపత్రాలతో పాటు నిర్ణీత గడువులోపు దరఖాస్తులు సమర్పించాలని సూచనలు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.