PG Course: హైదరాబాద్‌ జేఎన్టీయూలో పీజీ చేయాలనుందా.? ఈ పార్ట్‌ టైమ్‌ ప్రోగ్రామ్‌ మీకోసమే.. ఇలా అప్లై చేసుకోండి..

PG Course: బీటెక్‌ పూర్తిచేసి ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా.? పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేయాలని ఉన్నా ఉద్యోగం కారణంగా చేయలేకపోతున్నారా.? మీలాంటి వారి కోసమే హైదరాబాద్‌ జేఎన్టీయూ సదవకాశాన్ని తీసుకొచ్చింది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను..

PG Course: హైదరాబాద్‌ జేఎన్టీయూలో పీజీ చేయాలనుందా.? ఈ పార్ట్‌ టైమ్‌ ప్రోగ్రామ్‌ మీకోసమే.. ఇలా అప్లై చేసుకోండి..
Jntu Hyderabad
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 16, 2022 | 5:51 PM

PG Course: బీటెక్‌ పూర్తిచేసి ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా.? పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేయాలని ఉన్నా ఉద్యోగం కారణంగా చేయలేకపోతున్నారా.? మీలాంటి వారి కోసమే హైదరాబాద్‌ జేఎన్టీయూ సదవకాశాన్ని తీసుకొచ్చింది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను పార్ట్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏయే కోర్సులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఏయే కోర్సుల్లో ఖాళీలు ఉన్నాయంటే..

నోటిఫికేషన్‌లో భాగంగా ఎంటెక్ ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ (30), ఎంటెక్ పవర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ డ్రైవ్స్ (30), ఎంటెక్ ఇంజనీరింగ్ డిజైన్ (30), ఎంటెక్ ఎంబెడెడ్ సిస్టమ్స్ (30), ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ (30), ఎంటెక్ ఇండస్ట్రియల్ మెటలర్జీ (30), ఎంటెక్ బయోటెక్నాలజీ (30), ఎంటెక్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ (30), ఎంటెక్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ (30), ఎంటెక్ రిమోట్ సెన్సింగ్, జీఐఎస్ (30), ఎంబీఏ (హెచ్ఆర్/ఫైనాన్స్/మార్కెటింగ్/ఎంటర్ ప్రెన్యూర్షిప్) (30) కోర్సుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ పీజీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్ /ప్లానింగ్/అగ్రికల్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంఎస్సీ ఉత్తీర్ణత కూడా సాధించి ఉండాలి. అభ్యర్థ/లను ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్‌ 10,2022తో ముగియనుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయండి.