AIIMS INI CET 2023 నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే..
దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ విద్యా సంస్థల్లో 2023-24 విద్యాసంత్సరానికి సంబంధించి మెడికల్, డెంటల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (INI CET 2023)నోటిఫికేషన్..
AIIMS INI CET 2023 Exam date: దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ విద్యా సంస్థల్లో 2023-24 విద్యాసంత్సరానికి సంబంధించి మెడికల్, డెంటల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ (INI CET 2023)నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకుల ద్వారా ఎయిమ్స్(న్యూదిల్లీ), జిప్‌మర్(పుదుచ్చేరి), నిమ్‌హాన్స్(బెంగళూరు), పీజీఐఎంఈఆర్ (చండీగఢ్), ఎస్‌సీటీఐఎంఎస్‌టీ (త్రివేండ్రం), భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, నాగ్‌పుర్, పట్నా, రాయ్‌పూర్, రిషికేశ్, బీబీనగర్, బతిండా, డియోఘర్, మంగళగిరి తదితర ఎయిమ్స్ విద్యా సంస్థల్లో ఎండీ/ఎమ్‌ఎస్/ఎంసీహెచ్/డీఎం/ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రతీ యేట మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. పీజీ వైద్య విద్యనభ్యసించాలని కోరుకునే ఎంబీబీఎస్/బీడీఎస్‌లో ఉత్తీర్ణత సాధించిన మెడికల్ విద్యార్ధులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు మూడు గంటల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 26, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.2000, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. వికలాంగ విద్యార్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
ముఖ్యమైన తేదీలు…
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబర్ 26, 2022.
- ఎడిట్ ఆప్షన్ తేదీలు: సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు
- సర్టిఫికేట్స్ అప్‌లోడింగ్ తేదీలు: అక్టోబర్ 12 నుంచి నవంబర్ 13 వరకు
- అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ తేదీ: నవంబర్ 7
- రాత పరీక్ష తేది: నవంబర్ 13, 2022.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.