JMI Admission 2022-23 Registration Last date: జామియా మిలియా ఇస్లామియా (JMI) యూనివర్సిటీలో 202-23 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలు పొందడానికి దరఖాస్తు గడువును మే 25 వరకు పొడిగించింది. నాన్ సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2022 ద్వారా కాకుండా) ద్వారా యూజీ, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో అడ్మిషన్లు పొందగోరే విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వానియోగ పరచుకోవాలని సూచించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం CUET 2022 ద్వారా జేఎమ్‌ఐ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు కూడా తుది గడువులోపు జేఎమ్‌ఐ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ ఫారమ్ తప్పనిసరిగా పూరించాలని పేర్కొంది. కాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు గడువు మే 13తో ముగుస్తుంది. తాజా సడలింపుతో దాదాపు 13 రోజుల పాటు గడువును పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐతే రిజిస్ట్రేషన్ తుది గడువును ఏ కారణం చేత పొడిగించిందనేది మాత్రం యూనివర్సిటీ తెలుపలేదు. కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) ద్వారా 8 అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రోగ్రాములను నిర్వహిస్తామని జామియా ముందుగా తెలియజేసినప్పటికీ.. ప్రస్తుతం దాదాపు10 యూజీ కోర్సులకు సీయూఈటీ కింద ప్రవేశాలు నిర్వహించాలని యూనివర్సిటీ నిర్ణయించింది.
ఏయే కోర్సులంటే..
బీఏ (ఆనర్స్) హిందీ, బీఏ (ఆనర్స్) సంస్కృతం, బీఏ (ఆనర్స్) ఫ్రెంచ్, ఫ్రాంకోఫోన్ స్టడీస్, బీఏ (ఆనర్స్) స్పానిష్ అండ్ లాటిన్ అమెరికన్ స్టడీస్, బీఏ (ఆనర్స్) ఎకనామిక్స్, బీఏ (ఆనర్స్) హిస్టరీ, బీఎస్సీ బయోటెక్నాలజీ, BVoc (సోలార్ ఎనర్జీ), బీఎస్సీ (ఆనర్స్) ఫిజిక్స్, బీఏ (ఆనర్స్) టర్కిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: