JEE Exams 2021: జేఈఈ మెయిన్స్ అభ్యర్థులకు ఊరట.. కీలక ప్రకటన చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి..

JEE Main 2021 Update: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జేఈఈ(మెయిన్)..

JEE Exams 2021: జేఈఈ మెయిన్స్ అభ్యర్థులకు ఊరట.. కీలక ప్రకటన చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి..
Jee Exams
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 25, 2021 | 10:28 AM

JEE Main 2021 Update: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జేఈఈ(మెయిన్)-2021 అభ్యర్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. జేఈఈ మెయిన్ 2021 సెషన్ 3కి సన్నద్ధమవుతున్న మహారాష్ట్ర అభ్యర్థులకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. భారీ వర్షం, కొండచరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్స్‌కు సన్నద్ధమవుతున్న పలువురు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోలేని పరిస్థితి ఉంది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. వర్షాల కారణంగా సెషన్ 3లో పరీక్ష రాయలేకపోయిన మహారాష్ట్ర అభ్యర్థులకు మరో ఛాన్స్ ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ)కు సూచించారు.

“మహారాష్ట్రలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం చూస్తున్నాము. విద్యార్థుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని.. జేఈఈ(మెయిన్) -2021 సెషన్ 3 కోసం పరీక్షా కేంద్రానికి చేరుకోలేని అభ్యర్థులందరికీ మరో అవకాశం కల్పించాలని ‘ఎన్‌టిఏ’కి సూచించాను’’ అని ప్రధాన్ ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఈ ప్రవేశ పరీక్ష గురించి అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ‘‘జేఈఈ(మెయిన్)-2021 సెషన్ 3 కోసం జులై 25, 27 తేదీల్లో పరీక్ష కేంద్రాలకు చేరుకోలేకపోయిన కొల్హాపూర్, పాల్ఘర్, రత్నగిరి, రాయ్‌గఢ్, సింధుదుర్గ్, సంగ్లి&సతారా విద్యార్థులు ఆందోళన చెందొద్దు. వీరిందరికీ మరో అవకాశం ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించిన తేదీలను జాతీయ పరీక్షా నిర్వహణ సంస్థ(ఎన్‌టిఏ) త్వరలోనే ప్రకటిస్తుంది’’ అని మరో ప్రధాన్ మరో ట్వీట్ చేశారు.

దీనికి సంబంధించి అప్‌డేట్స్ కోసం ఎన్‌టిఎకు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్లు www.nta.ac.in, jeemain.nta.nic.in లను సందర్శించాలని సంబంధిత విద్యార్థులకు కేంద్ర విద్యాశాఖ మంత్రి సూచించారు. అలాగే.. జేఈఈ(మెయిన్) పరీక్షలకు సంబంధించిన మరింత స్పష్టత కోసం అభ్యర్థులు 011-40759000 ను సంప్రదించవచ్చన్నారు. లేదంటే.. jeemain@nta.ac.in లో ఇమెయిల్ చేయవచ్చు అని తెలిపారు.

మహారాష్ట్రలో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో జల విలయం కొనసాగింది. రోడ్లు తెగిపోయాయి. కొండ చరియలు విరిగిపడటంతో.. రైళ్ల రాకపోకలకూ తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో రోడ్లు, వీదులు నదులను తలపించాయి. జన జీవనం పూర్తి స్తంభించిపోయింది. ఈ భారీ వర్షం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 82 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది తప్పిపోయారు.

ఇక జేఈఈ(మెయిన్) 2021 పరీక్షలో భాగంగా సెషన్ 3, సెషల్ 4 మధ్య నాలుగు వారాల వ్యవధిని ఇవ్వనున్నారు. దీని ప్రకారం.. జేఈఈ సెషన్ 4 ఆగస్టు 26, 27, 31 , సెప్టెంబర్ 1, 2 వ తేదీల్లో నిర్వహించనున్నారు. జేఈఈ 2021 సెషన్ 4 కోసం మొత్తం 7.32 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.

Central Minister:

Also read:

India Covid-19 cases: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న ఎంతమంది చనిపోయారంటే..?

Tokyo Olympics 2020 Live: తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన పీవీ సింధు; టెన్నిస్‌ డబుల్స్‌లో సానియాజోడీ ఓటమి

వెంకటేష్ గారు కాళ్లు పట్టుకున్నప్పుడు!అంటూ ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పిన విలక్షణ నటుడు శ్రీతేజ్‌..:Narappa Shritej Video.