AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSRJC CET 2021 Exam Date: ఆగస్టు 14న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ ప్రవేశ పరీక్ష..

TSRJC CET 2021 Exam Date: కరోనా సెకండ్‌ వేవ్‌ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరాన్ని ప్రారంభించేందుకు పలు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగా

TSRJC CET 2021 Exam Date: ఆగస్టు 14న టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ ప్రవేశ పరీక్ష..
TSRJC CET 2021
Shaik Madar Saheb
|

Updated on: Jul 24, 2021 | 5:16 PM

Share

TSRJC CET 2021 Exam Date: కరోనా సెకండ్‌ వేవ్‌ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరాన్ని ప్రారంభించేందుకు పలు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగా పలు ప్రవేశ పరీక్షలను సైతం నిర్వహిస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ ప్రభుత్వం సైతం పలు ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఆగస్టు 14న తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కళాశాలలు (టీఎస్ఆర్‌జేసీ 2021) సెట్‌ను నిర్వహించనున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రమణకుమార్‌ శనివారం వెల్లడించారు. కరోనా నిబంధనలతో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని 35 గురుకులాల్లో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, పలు విభాగాల్లో ఆంగ్లమాధ్యమంలో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ను నిర్వహిస్తారు. కాగా.. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులు ఆగస్టు 9 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కార్యదర్శి రమణకుమార్‌ తెలిపారు. ఆగస్టు 14న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆయా విభాగాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు.

Also Read:

Hyderabad: ట్రాఫిక్ జామ్‌లో చిక్కున్న అంబులెన్స్ .. దారి ఇవ్వడానికి ప్రోటోకాల్ అడ్డంటూ పోలీసు వాదన

Bicycle Thief : లగ్జరీ సైకిల్ కనిపిస్తే చాలు స్కెచ్ వేసేస్తాడు..! దొంగగా మారిన 24 ఏళ్ల నిరుద్యోగి..