
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 పరీక్ష ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ ఐఐటీ గువాహటి ఆదివారం (జూన్ 11) విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన రెండు పేపర్ల ప్రొవిజినల్ సమాధానాల కీలతో పాటు, విద్యార్థులు ఫీడ్‌బ్యాక్ తెలిపేందుకు అధికారిక వెబ్‌సైట్ లో వేర్వేరుగా లింక్‌లను అందుబాటులో ఉంచింది. జూన్ 12 సాయంత్రం 5గంటలవరకు అవకాశం ఆన్సర్ ‘కీ’ పై అభ్యంతరాలు లేవనెత్తేందుకు విద్యార్థులకు అవకాశం ఇచ్చింది.
కాగా జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 1.9 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన జోస్సా కౌన్సెలింగ్ షెడ్యూల్ 2023 కూడా గువాహటి ఐఐటీ ఇప్పటికే విడుదల చేసింది. మొత్తం ఆరు విడతలుగా, 38 రోజులపాటు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మరోవైపు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు జూన్ 18న విడుదల కానున్నాయి. రిజల్ట్స్ విడుదలై తర్వాత రోజు నుంచే అంటే జూన్ 19 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 పేపర్ 1 ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 పేపర్ 2 ఆన్సర్ కీ కోసం క్లిక్ చేయండి
ఫీడ్‌బ్యాక్ కోసం క్లిక్ చేయండి
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.