Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జాబ్ మార్కెట్‌ నయా ట్రెండ్.. ఆ స్కిల్స్‌ అప్‌గ్రేడ్‌ చేసుకుంటేనే భవితవ్యం!

అభివృద్ధి చెందుతున్న సాంకేతికత కారణంగా దాదాపు 40 శాతం మంది శ్రామిక శక్తికి జాబ్ మార్కెట్లో పోటీతత్వాన్ని కొనసాగించడానికి అప్‌స్కిల్లింగ్ అవసరం అవుతుందని నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా AWS నైపుణ్యం ఉన్నవారు, అన్ని అనుభవ స్థాయిలలో దాదాపు 10 శాతం జీతాలు పెరిగాయి..

జాబ్ మార్కెట్‌ నయా ట్రెండ్.. ఆ స్కిల్స్‌ అప్‌గ్రేడ్‌ చేసుకుంటేనే భవితవ్యం!
India ITeS sector
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 26, 2025 | 5:52 AM

దేశంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటీఈఎస్) సెక్టార్ విస్తరణకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ ఏడాది ఐటీఈఎస్ రంగంలో ఉద్యోగ అవకాశాలు 20 శాతం పెరుగుతాయని ఇన్‌స్టాహైర్ టెక్ శాలకీ ఇండెక్స్ 2025 వెల్లడించింది. శాలరీ డైనమిక్స్ వివిధ అనుభవ స్థాయిలు, డొమైన్‌లలో మారుతున్నట్లు సూచించింది. AI-ఆధారిత నియామక వేదిక అయిన ఇన్‌స్టాహైర్ 42 వేలకుపైగా అభ్యర్థుల ప్రొఫైల్‌లు, 11 వేలకుపైగా రిక్రూటర్-అభ్యర్థి పరస్పర ఇంటరాక్షన్‌ అధ్యయనం ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.

AI, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో 75 శాతం ఉద్యోగాల పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. ఇది అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల డిమాండ్‌ను వెల్లడిస్తుంది. గిగ్ ఎకానమీ, రిమోట్ వర్క్ మోడల్స్ కూడా ఈ రంగంలో అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే అభివృద్ధి చెందుతున్న సాంకేతికత కారణంగా దాదాపు 40 శాతం మంది శ్రామిక శక్తికి జాబ్ మార్కెట్లో పోటీతత్వాన్ని కొనసాగించడానికి అప్‌స్కిల్లింగ్ అవసరం అవుతుందని నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా AWS నైపుణ్యం ఉన్నవారు, అన్ని అనుభవ స్థాయిలలో దాదాపు 10 శాతం జీతాలు పెరిగాయి. అయితే కెరీర్ ప్రారంభంలో జీతాలు తగ్గుదల కనిపిస్తుంది. ముఖ్యంగా 0-5 సంవత్సరాల అనుభవం ఉన్న ఫ్రంట్‌ఎండ్ డెవలపర్‌ల జీతం సుమారు 1.5 LPA (ఏడాదికి లక్షలు) తగ్గింది. ఇందుకు విరుద్ధంగా 6 ఏళ్లకు పైగా అనుభవజ్ఞులైన ఫ్రంట్‌ఎండ్ నిపుణులకు దాదాపు 4 లక్షల వార్షిక ఆదాయం పెరిగింది. మొబైల్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్‌లో ఇలాంటి ధోరణులు కనిపిస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

పైథాన్ అత్యధికంగా డిమాండ్‌ ఉన్న బ్యాకెండ్ స్కిల్‌గా కొనసాగుతోంది. ఇందులో ప్రతి ఐదేళ్ల ఎక్స్‌పీరియన్స్‌కు జీతాలు దాదాపు రెట్టింపు అవుతున్నాయి. అలాగే ఈ రేసులో జావా స్కిల్స్‌ కూడా గణనీయమైన వృద్ధిని కనబరుస్తున్నాయి. 0 నుంచి పదేళ్లకుపైగా అనుభవం ఉన్న నిపుణులకు జీతాలు ఐదు రెట్లు పెరిగాయి. భారత్‌ టెక్ వర్క్‌ఫోర్స్‌లో బెంగళూరు 35 శాతం వాటా కలిగి ఉంది. ఆ తర్వాత ఢిల్లీ-ఎన్‌సిఆర్, హైదరాబాద్ 20 శాతం, పూణే 15 శాతం, చెన్నై 10 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. అయితే రిమోట్ వర్కింగ్ నిపుణులు మెట్రోయేతర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. కంపెనీలు ముఖ్యంగా AI-ఆధారిత రోల్స్ కోసం టాలెంట్ పూల్‌ను విస్తరిస్తున్నాయి. దీంతో చండీగఢ్, జైపూర్, ఇండోర్ వంటి టైర్-2 నగరాలు టెక్ హబ్‌లుగా అభివృద్ధి చెందుతున్నాయి. సైబర్ సెక్యూరిటీ, స్పేస్ టెక్నాలజీ స్టార్టప్‌లు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలలో నియామకాలు పెరగనున్నాయి. ప్రత్యేక నైపుణ్య వారికి డిమాండ్‌ కంపెనీలు స్వాగతం పలుకుతాయి. ఇందులో డీప్ టెక్, AI స్కిల్స్‌కి అధిక డిమాండ్‌ ఉంది. జాబ్‌ మార్కెట్లో మారుతున్న డిమాండ్‌కు అనుగుణంగా స్పెషలైజేషన్‌లో స్కిల్స్‌ వృద్ధి చేసుకునే నిపుణులు మాత్రమే కెరీర్ వృద్ధిలో ముందంజలో ఉంటారని ఇన్‌స్టాహైర్ సహ వ్యవస్థాపకుడు సర్బోజిత్ మల్లిక్ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.