Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Layoffs: వరుస లే ఆఫ్‌లు ప్రకటిస్తున్న టెక్ కంపెనీలు

ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఉద్యోగాల్లో కోతలను కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల ఒత్తిడి, టారిఫ్ వార్, మాంద్యం భయాలు, లాభాల తగ్గుదల, ఏఐ వినియోగం వంటి అంశాలు కారణంగా కంపెనీలు ఖర్చులు తగ్గించేందుకు ఉద్యోగులను ఉద్వాసన పలుకుతున్నాయి. 2023లో 11వందల 93 కంపెనీలు 2.64 లక్షల మందిని తొలగించగా, 2024లో 549 కంపెనీలు 1.52 లక్షల మందిని ఉద్వాసన పలికాయి.

Layoffs: వరుస లే ఆఫ్‌లు ప్రకటిస్తున్న టెక్ కంపెనీలు
Layoffs
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 08, 2025 | 4:42 PM

ప్రపంచవ్యాప్తంగా టెక్‌ ఉద్యోగాల కోత కొనసాగుతుంది. గ్లోబల్‌ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్‌ వార్‌, అమెరికాలో మాంద్యం భయాలు, లాభాల క్షీణత, ఏఐ వినియోగంతో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి టెక్ కంపెనీలు. కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. 150కి పైగా అమెరికన్ కంపెనీలు జూన్‌లో లేఆఫ్‌లు ప్రకటించాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 27 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటు వేశాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా అనేక సంస్థల్లో భారీగా ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నారు.

రెండేళ్లుగా.. వరుస లే ఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి టెక్ కంపెనీలు. గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా.. వందలాది కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. జూన్‌లో వారం రోజుల్లో 300మందికి మైక్రోసాఫ్ట్ లే ఆఫ్‌ ప్రకటించింది. మేలో 6000మందిని మైక్రోసాఫ్ట్ తొలగించింది. 2023లో 10వేల మందిని ఉద్వాసన పలికింది మైక్రోసాఫ్ట్. 2024లో 10శాతం ఉద్యోగులకు గూగుల్ కోత పెట్టింది. 2023లో 12వేల మందిని తొలగించింది గూగుల్ సంస్థ.

ఓవరాల్‌గా చూస్తే.. 2023లో 11వందల 93 కంపెనీలు 2లక్షల 64వేల 220 మంది తొలగించాయి. 2024లో 549 కంపెనీలు లక్షా 52వేల 472 మందిని ఇంటికి పంపాయి. 2025లో ఇప్పటివరకు 100కు పైగా టెక్ కంపెనీలు 27వేల 762మందికి ఉద్వాసన పలికాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్‌ వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
పచ్చగడ్డిపై చెప్పుల్లేకుండా నడవండి.. ఫలితం మీరే చూడండి వీడియో
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
బందర్‌లో దృశ్యం మార్క్‌ క్రైమ్‌ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
భారత్‌కు వచ్చేసిన స్టార్‌లింక్‌... మరింత చౌకగా హైస్పీడ్‌ ఇంటర్నెట
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో
70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో