Scholarships: కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

|

Jan 13, 2022 | 9:39 AM

వివిధ కార్మిక సంస్థల్లో పనిచేసే విద్యార్థుల చదువుల కోసం కార్మిక సంక్షేమ బోర్డు ఉపకార వేతనాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు

Scholarships: కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Follow us on

వివిధ కార్మిక సంస్థల్లో పనిచేసే విద్యార్థుల చదువుల కోసం కార్మిక సంక్షేమ బోర్డు ఉపకార వేతనాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్మికశాఖ హైదరాబాద్ అదనపు కమిషనర్ శ్యాం సుందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కార్మిక సంక్షేమ శాఖా కార్యాలయాల్లో వీటికి సంబంధించిన దరఖాస్తులు లభ్యమవుతాయి. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 15లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

వివిధ దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, మోటారు సంస్థలు, కర్మాగారాలు ఇంకా వివిధ ట్రస్టుల్లో పనిచేసే కార్మికుల పిల్లలు ఈ ఉపకారవేతనాలకు అర్హులు. కార్మిక సంక్షేమ బోర్డులో నమోదైన వారి పిల్లలు మాత్రమే ఈ ఉపకార వేతనాలకు అర్హులని, 2020-21 విద్యా సంవత్సరంలో నిర్ణీత కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలని, ప్రతిభ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తామని కార్మిక శాఖ కమిషనర్‌ తెలిపారు. స్కాలర్ షిప్స్ కు ఎంపికైతే పదో తరగతి, ఐటీఐ విద్యార్థులకు రూ.1000, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 1500, ఇంజినీరింగ్, వైద్య, విద్య, న్యాయవిద్య, బీడీఎస్, బీఎస్సీ (అగ్రికల్చర్, హార్టీ కల్చర్ ), బీ-ఫార్మసీ, ఎంబీఏ తదితర కోర్సులు చదివే విద్యార్థులకు రూ. 2వేల చొప్పున ఉపకార వేతనాలు లభిస్తాయి.

Also Read:

AP Cinema Ticket Issue: జగన్ ను కలవనున్న చిరంజీవి… వివాదం ముదురుతున్న నేపథ్యంలో రంగంలోకి చిరు.. (వీడియో)

Naga Chaitanya: సినిమా టికెట్స్ రేట్స్ ఇష్యూపై స్పందించిన నాగచైతన్య.. అందుకే అలా తీశామంటూ..

Vaishnav Tej: మెగా హీరో వైష్ణవ్ తేజ్ బర్త్ డే స్పెషల్.. క్రేజీ అప్డేట్ ఇవ్వనున్న మేకర్స్ ?..