AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naga Chaitanya: సినిమా టికెట్స్ రేట్స్ ఇష్యూపై స్పందించిన నాగచైతన్య.. అందుకే అలా తీశామంటూ..

అక్కినేని నాగార్జున (Nagarjuna)... డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు(Bangarraju). గతంలో

Naga Chaitanya: సినిమా టికెట్స్ రేట్స్ ఇష్యూపై స్పందించిన నాగచైతన్య.. అందుకే అలా తీశామంటూ..
Naga Chaitanya
Rajitha Chanti
|

Updated on: Jan 13, 2022 | 9:12 AM

Share

అక్కినేని నాగార్జున (Nagarjuna)… డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు(Bangarraju). గతంలో వచ్చి న సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సిక్వెల్‏గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), కృతి శెట్టి కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల విడుదలైన బంగార్రాజు ట్రైలర్‏ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ సినిమా రేపు (జనవరి 14న ) సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈక్రమంలో సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా నాగ చైతన్యతో మీడియాతో ముచ్చటించాడు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఏపీ టికెట్స్ రేట్స్ విషయం పై కూడా చైతూ స్పందించారు.

నాగాచైతన్య మాట్లాడుతూ.. సినిమా టికెట్ ధరల గురించి నాన్నతో చాలాసార్లు చర్చలు జరిగాయి. టికెట్ ధరల విషయంలో గతేడాది ఏప్రిల్ 8న ఏపీలో జీవో వచ్చిందనుకుంటున్నాను. మేం బంగార్రాజు షూటింగ్ ఆగస్టు నెలలో స్టార్ట్ చేశాం. అప్పట్లో ఉన్న టికెట్ ధరలను దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గ బడ్జెట్ లో ఈ సినిమా చేశాం. భవిష్యత్తులో సినిమా టికెట్ ధరలు పెరిగితే మనకు బోనస్ అవుతుందని నాన్న అన్నారు. థ్యాంక్యూ సినిమా అంటే నిర్మాత దిల్ రాజు గారు చూసుకుంటారు. నేను సినిమా చేసేముందు నిర్మాతతో మాట్లాడతాను. ఆయనకు కంఫర్ట్ అయితే నాకు కంఫర్ట్. ఇక రాజకీయపరమైన నిర్ణయాలకు విభిన్నమైన కారణాలు ఉండొచ్చు. నేను అందుకు వ్యతిరేకం కాదు. ఉన్న పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళ్లాలి అంటూ చెప్పుకొచ్చారు. అలాగే సమంతతో తన విడాకుల గురించి చైతన్య మాట్లాడుతూ.. ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేశారు. అది ఇద్దరి మంచి కోసం తీసుకున్న నిర్ణయం. ఆమె హ్యాపీ.. నేను హ్యాపీ. ఈ పరిస్థితులలో ఇద్దరికీ ఇదే మంచిదనుకున్నాం అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: Pooja Hegde: బుట్ట‌బొమ్మ స్టెప్‌ను సృష్టించింది తామే అంటోన్న పూజా.. అర్హ‌తో ఆస‌క్తిక‌ర‌మైన వీడియో..

Teaser Talk: అస‌లు మ‌నిషి చ‌ర్మంతో వ్యాపారం ఏంటి..? ఆసక్తిరేపుతోన్న హ‌న్సిక కొత్త సినిమా టీజ‌ర్‌..

Nidhi Agarwal : అందాల నిధికి కాబోయేవాడికి ఆ క్వాలిటీస్ ఉండాలట.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అమ్మడు

Bhamakalapam: ఆకట్టుకుంటున్న ప్రియమణి న్యూలుక్.. ఆహాలో రాబోతున్న భామా కలాపం..

Follow Us
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి