Indian Railways Recruitment 2021: ఇండియన్ రైల్వేస్ భారీ ఎత్తున అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా 1600కిపైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నార్త్ సెంట్రల్ రైల్వేస్ పలు విభాగాలకు చెందిన వర్క్ షాప్‌లలో శిక్షణ ఇస్తారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలై ఓ లుక్కేయండి..
* పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1664 పోస్టులను భర్తీచేయనున్నారు.
* పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 శాతం మార్కులతో 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీరితో పాటు 8వ తరగతి చదివి ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
* అభ్యర్థుల వయసు సెప్టెంబర్ 1, 2021 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ఈ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికై శిక్షణ పొందిన అభ్యర్థులకు భవిష్యత్తులో రైల్వేలో ఉండే లెవల్ 1 పోస్టుల నియామకాల్లో 20 శాతం ప్రత్యేక కోటా ఉంటుంది.
* సాధారణంగా లెవల్ 1 ఉద్యోగాలకు జీతం రూ. 18000 నుంచి రూ. 56,900గా ఉంటుంది.
* ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 2న ప్రారంభం కాగా సెప్టెంబర్ 1, 2021తో ముగియనుంది.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ