IIIT Kota Recruitment: కోటా ట్రిపుల్ ఐటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
IIIT Kota Recruitment: రాజస్థాన్‌లోని కోటాలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా నాన్ టీచింగ్ పోస్టులను..
IIIT Kota Recruitment: రాజస్థాన్‌లోని కోటాలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో ఖాళీలు, అర్హతలు వంటి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* పలు విభాగాల్లో మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * వీటిలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ (02), అసిస్టెంట్ లైబ్రేరియన్ (01), టెక్నికల్ అసిస్టెంట్ (02), టెక్నీషియన్ (05), సూపరింటెండెంట్ (02), అకౌంటెంట్ (01), జూనియర్ అసిస్టెంట్ (06), ఆఫీస్ అటెండెంట్ (02) ఖాళీలున్నాయి. * పోస్టుల ఆధారంగా అభ్యర్థులు ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/బీటెక్/బీఆర్క్/ఎంసీఏ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. * అభ్యర్థులకు సంబంధిత పనిలో అనుభవంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్స్ ఉండాలి. * అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 27ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా 31-07-2021గా నిర్ణయించారు. * అభ్యర్థులను రాతపరీక్ష/ఇంటర్వ్యూ/ట్రేడ్ టెస్ట్ ఆధరాంగా ఎంపిక చేస్తారు. * పూర్తి వివరాంల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..