Indian Coast Guard Jobs 2023: నిరుద్యోగులకు సదావకాశం.. టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో 255 నావిక్ ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో.. 255 నావిక్ (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచి) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

Indian Coast Guard Jobs 2023: నిరుద్యోగులకు సదావకాశం.. టెన్త్‌/ఇంటర్‌ అర్హతతో ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో 255 నావిక్ ఉద్యోగాలు..
Indian Coast Guard
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 25, 2023 | 9:41 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌ గార్డులో.. 255 నావిక్ (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచి) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ లేదా 12వ తరగతి, నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్) పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్హతలతోపాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే సెప్టెంబర్‌ 1, 2001 నుంచి ఆగస్టు 31, 2005 తేదీల మధ్య జన్మించి ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఫిబ్రవరి 16, 2023వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.300లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేకుండా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,700ల జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.