IIT Recruitment: ఐఐటీ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? నేడే చివరి తేదీ..
IIT Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పాట్నాలోని ఈ విద్యా సంస్థలో స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (సోమవారం) ముగియనున్న నేపథ్యంలో..
IIT Recruitment: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పాట్నాలోని ఈ విద్యా సంస్థలో స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణకు గడువు నేటితో (సోమవారం) ముగియనున్న నేపథ్యంలో.. ఏ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం…
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు…
* నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ ఇన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా బంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 32 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం హార్డ్ కాపీలను ఆఫ్‌లైన్ విధానంలో పంపించాలి.
* హార్డ్ కాపీలను ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ సెల్, ఫ్యాకల్టీ అఫైర్స్ ఆఫీస్, ఐఐటీ పాట్నా–801106, బీహార్ అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను ముందుగా అకడమిక్, పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,01,500 నుంచి రూ.2,20,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 28-02-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Telangana: అది నా అడ్డా అంటున్న ఎమ్మెల్యే.. అంతలేదు అంటున్న మాజీ ఎంపీ.. ఇంతకీ వీరి గొడవేంటో తెలుసా?
Defection Case: గోవాలో ఫిరాయింపులపై కాంగ్రెస్ ఫోకస్.. మరో అవకాశం దిశగా ఆ పార్టీ అడుగులు..
Covid 4th Wave: కరోనా ఫోర్త్ వేవ్ ఎంట్రీ.. కీలక ప్రకటన చేసిన శాస్త్రవేత్తలు..!