IIT Madras: వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు ఐఐటీ మద్రాస్‌ బంపరాఫర్‌.. ఇండస్ట్రీ ఆధారిత సర్టిఫికెట్‌ ప్రోగ్రాం..

IIT Madras: మీరు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నారా.? నైపుణ్యాలు పెంచుకొని మీ కెరీర్‌ను మరింత స్ట్రాంగ్‌గా మార్చుకోవాలనుకుంటున్నారా.? అయితే మీ కోసమే ఐఐటీ మద్రాస్‌ ఓ బంపరాఫర్‌ను తీసుకొచ్చింది. ఈ-మొబిలిటీలో...

IIT Madras: వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కు ఐఐటీ మద్రాస్‌ బంపరాఫర్‌.. ఇండస్ట్రీ ఆధారిత సర్టిఫికెట్‌ ప్రోగ్రాం..
Iit Madras
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 23, 2022 | 9:32 AM

IIT Madras: మీరు ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నారా.? నైపుణ్యాలు పెంచుకొని మీ కెరీర్‌ను మరింత స్ట్రాంగ్‌గా మార్చుకోవాలనుకుంటున్నారా.? అయితే మీ కోసమే ఐఐటీ మద్రాస్‌ ఓ బంపరాఫర్‌ను తీసుకొచ్చింది. ఈ-మొబిలిటీలో ఇండస్ట్రీ ఆధారిత ఆన్‌లైన్‌ సర్టిఫికెట్ పొందే అవకాశాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో కోర్సు చేసే సరికొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తోంది. ఈ కోర్సులో మొత్తం తొమ్మిది మాడ్యూల్స్‌ ఉంటాయి. వీటిలో నాలుగు మాడ్యూల్స్‌కు ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్రొఫెష‌న‌ల్స్ కంటెంట్ అందిస్తారు.

పరిశ్రమ నిపుణుల ఇన్‌పుట్స్‌తో ఈ సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తారు. ఈ స‌ర్టిఫికెట్ ప్రోగ్రాంను టెక్నాల‌జీ, మార్కెట్ ట్రెండ్స్‌, ప‌రిశ్రమల అవసరాలకనుగుణంగానిరంతరం అప్‌గ్రేడ్ చేస్తామ‌ని ఐఐటీ మద్రాస్ తెలిపింది. ఈ కోర్సును ఐఐటీ మద్రాస్‌కు చెందిన సెంట‌ర్ ఫ‌ర్ అవుట్‌రీచ్ అండ్ డిజిట‌ల్ క‌మ్యూనికేష్ (కోడ్‌) విభాగం అందిస్తోంది. కోర్సులో భాగంగా వాహ‌న అభివృద్ధి, ప‌వ‌ర్ ఎల‌క్ట్రానిక్స్‌, బ్యాట‌రీ ఇంజ‌నీరింగ్‌, థ‌ర్మల్ మేనేజ్‌మెంట్‌, ప‌వ‌ర్ ట్రెయిన్ వంటి సాంకేతిక అంశాలపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు.

ఈ కోర్సు గురించి ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ కామకోటి మాట్లాడుతూ.. ‘వివిధ ప‌రిశ్రమ‌లల్లో ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న. వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ కోసం ఈ సరికొత్త ప్రోగ్రామ్‌ను లాంచ్‌ చేశాము. 2022 అక్టోబర్‌ బ్యాచ్‌ కోసం అర్హులైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి సెప్టెంబర్‌ 20వ తేదీని చివరి తేదీగా నిర్ణయించాము’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..