
హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన ఛైర్మన్‌గా ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం నియమితులైన సంగతి తెలిసిందే. బుర్రా వెంకటేశం నియామక ఫైల్‌పై గవర్నర్ జిష్టుదేవ్ వర్మ సంతకం చేశారు కూడా. ఈ మేరకు డిసెంబర్ 3న ఆయన ఆ పదవిని చేపట్టనున్నారు. అయితే ప్రస్తుత టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న మహేందర్ రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో ముగియనుంది. ఈ నేపథ్యంలో బుర్రా వెంకటేశం ఐఏఎస్‌కు కొలువుకు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయనున్నారు. 1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన బుర్రా వెంకటేశం సర్వీస్ 2028 ఏప్రిల్ 10 వరకు ఉంది. టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా ఆయన 2030 ఏప్రిల్ 10 వరకు కొనసాగే అవకాశం ఉంది.
టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి జనవరి 25న బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ పదవిలో యాన కేవలం11నెలల పాటే కొనసాగారు. టీఎస్‌పీఎస్‌పీ నిబంధనల ప్రకారం చైర్మన్‌గా, కమిషన్ సభ్యులుగా నియమితులైనవాళ్లు 62 ఏళ్ల వయసు వరకు మాత్రమే ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. అలాగే 6 యేళ్ల పాటు గరిష్టంగా ఆ పదవిలో కొనసాగవచ్చు. 1962లో డిసెంబర్3న జన్మించిన మహేందర్‌రెడ్డి.. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆయన వయసు 61 సంవత్సరాల 1 నెల 22 రోజులు. దీంతో మరో 11 నెలలు గడిస్తే ఆయనకు 62 ఏళ్లు వచ్చేస్తాయ్. ఈ నేపథ్యంలోనే చైర్మన్‌గా మహేందర్‌రెడ్డి 11 నెలల అనంతరం డిసెంబర్ 3వ తేదీన టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా జనవరిలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించింది. ఆయనతో పాటు మరో ఐదుగురు టీజీపీఎస్సీ సభ్యులుగా నియమితులయ్యారు. అప్పటి గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేయడంతో వారంతా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం విషయానికొస్తే.. జనగామ జిల్లాకు చెందిన ఆయన ప్రస్తుతం విద్యాశాఖ, గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజుల్లో బుర్రావెంకటేశంను నూతన ఛైర్మన్‌గా నియమించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.