NALSAR Recruitment: హైదరాబాద్ నల్సార్ వర్సిటీలో టీచింగ్ పోస్టులు.. ఎలా ఎంపిక చేస్తారంటే.
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఈ విద్యా సంస్థలో టీచింగ్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు...
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్‌లోని ఈ విద్యా సంస్థలో టీచింగ్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 58 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రొఫెసర్(లా, మేనేజ్‌మెంట్) (10), అసోసియేట్ ప్రొఫెసర్(లా, మేనేజ్‌మెంట్) (12), అసిస్టెంట్ ప్రొఫెసర్(లా, మేనేజ్‌మెంట్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ (33), డైరెక్టర్(డైరెక్టరేట్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్) (01), హెడ్, కార్పొరేట్ ఇంటర్‌ఫేస్ (01), ప్లేస్‌మెంట్ ఆఫీసర్ (01)పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను పోస్టుల ఆధారంగా పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, ఐజీడబ్ల్యూఏ, సీఎంఏ ఉత్తీర్ణత, నెట్/ స్లెట్/ సెట్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1,000 (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు రూ.750) చెల్లించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను పరీక్ష, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 31-03-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..