Hindustan Copper Limited: హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Hindustan Copper Limited Recruitment 2021: ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మలజ్‌కంద్‌లో ఉన్న ఈ సంస్థలో నాగ్ ఎగ్జిక్యూటివ్...
Hindustan Copper Limited Recruitment 2021: ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మలజ్‌కంద్‌లో ఉన్న ఈ సంస్థలో నాగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 21 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 21 పోస్టుల్లో భాగంగా ఎలక్ట్రీషియన్ గ్రేడ్, ఎలక్ట్రీషియన్ కమ్ లైన్‌మెన్ గ్రేడ్ విభాగాల్లో ఉద్యోగులను తీసుకున్నారు.
* ఎలక్ట్రీషియన్ గ్రేడ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ(ఎలక్ట్రీషియన్), ఎన్‌సీవీటీ ఉత్తీర్ణులవ్వాలి. వైర్‌మెన్ లైసెన్స్ ఉండాలి. వీటితో పాటు క నీసం 3ఏళ్ల అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
* ఎలక్ట్రీషియన్ కమ్ లైన్‌మెన్ ట్రేడ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు.. ఐటీఐ( ఎలక్ట్రీషియన్), ఎన్‌సీవీటీ ఉత్తీర్ణులవ్వాలి. వైర్‌మెన్ లైసెన్స్ ఉండాలి. కనీసం 3ఏళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఎలక్ట్రీషియన్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 18,180–రూ.37,310 చెల్లిస్తారు.
* ఎలక్ట్రీషియన్ కమ్ లైన్‌మెన్ ట్రేడ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.18,180–రూ.37,310 చెల్లిస్తారు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులకు చివరి తేదీగా 15.07.2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు www.hindustancopper.com వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also Read: Parenting: చిన్నారుల చక్కని భవిష్యత్ కోసం మొదటి బడి ఇల్లే.. విలువల పాఠాలు నేర్పాల్సింది అక్కడే!
Livable Cities: అన్నింటినీ అతాలకుతలం చేసేసిన కరోనా.. నివాసయోగ్య నగరాలను సైతం మార్చేసింది..