GATE 2022 results: గేట్‌ 2022 అభ్యంతరాలకు నేడే ఆఖరు.. మరికొన్ని గంటల్లోనే..

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE) 2022 ఆన్సర్ కీపై అభ్యంతరాలను లేవనెత్తడానికి నేడే (ఫిబ్రవరి 25) చివరిరోజు. మరొకొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌ విండో క్లోజ్‌ అవుతుంది. ఇంకా..

GATE 2022 results: గేట్‌ 2022 అభ్యంతరాలకు నేడే ఆఖరు.. మరికొన్ని గంటల్లోనే..
Gate 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 25, 2022 | 5:21 PM

GATE 2022 final answer key will be declared on March 17: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE) 2022 ఆన్సర్ కీపై అభ్యంతరాలను లేవనెత్తడానికి నేడే (ఫిబ్రవరి 25) చివరిరోజు. మరొకొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌ విండో క్లోజ్‌ అవుతుంది. ఇంకా అభ్యర్థులెవరికైనా గేట్‌ ఆన్సర్‌ కీపై అభ్యంతరాలుంటే వెంటనే GATE Online Application Processing System ద్వారా అబ్జక్షన్స్ (objections)కు దరఖాస్తు చేసుకోగలరు. ప్రతి అభ్యంతరానికి రూ.500 విధిగా చెల్లించవల్సి ఉంటుంది. కాగా అభ్యర్థులు సమర్పించిన అభిప్రాయాలన్నింటినీ సమీక్షించిన తర్వాతనే.. ఐఐటీ ఖరగ్‌పూర్ గేట్‌ 2022 తుది ఫలితాలను ప్రకటిస్తుంది. గేట్ తుది సమాధాన కీ మార్చి17న అధికారిక వెబ్‌సైట్- gate.iitkgp.ac.inలో విడుదలౌతుంది. దీని ఆధారంగానే ఫలితాలు ప్రకటించబడతాయి. మార్చి 21 నుంచి స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం రిక్రూట్‌మెంట్-కమ్-అడ్మిషన్ టెస్టును ఈ నెల (ఫిబ్రవరి) 5 నుంచి13 మధ్య జరిగింది. గేట్ 2022 పరీక్షకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.gate.iitkgp.ac.inను సందర్శించాలని అభ్యర్ధులకు ఈ సందర్భంగా ఇన్‌స్టిట్యూట్‌ సూచించింది.

GATE Answer Key 2022పై అభ్యంతరాలను ఎలా లేవనెత్తాలంటే..

  • ముందుగా GOAPS వెబ్‌సైట్‌ gate.iitkgp.ac.inను ఓపెన్‌ చెయ్యాలి.
  • ‘Contest Answer Key’ ట్యాబ్‌పై క్లిక్ చెయ్యాలి.
  • ఒక్కో challengeకు రూ. 500ల చొప్పున ఫీజు చెల్లించాలి.
  • ఎన్ని ప్రశ్నలుంటే అన్ని ప్రశ్నల సంఖ్యను నమోదు చెయ్యాలి.
  • అవసరమైన సపోర్టింగ్‌ డాక్యుమెంట్లను అటాచ్ చెయ్యాలి.

Also Read:

Delhi Judicial Service Examination 2022: ఢిల్లీ హయ్యర్‌ జ్యుడీషియల్ సర్వీస్‌ ఎగ్జాం 2022 నోటిఫికేషన్.. ఎన్ని పోస్టులున్నాయంటే..