FCI Recruitment: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ. 60 వేలకుపైగా జీతం పొందే అవకాశం..
FCI Recruitment 2021: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పంజాబ్‌లోని ఎఫ్‌సీఐలో వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం.
FCI Recruitment 2021: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పంజాబ్‌లోని ఎఫ్‌సీఐలో వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 860 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అర్హతలు ఏంటన్న పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 860 వాచ్‌మెన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐదు/ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01.09.2021 నాటికి 18–25ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాతపరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్(పీఈటీ) ఆధారంగా ఎంపికచేస్తారు.
* ఈ పరీక్షని 120 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ, పంజాబీలో ఉంటుంది.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.23,000 నుంచి రూ.64,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 10-11-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇలా అప్లై చేసుకోండి..
* అభ్యర్థులు ముందుగా ఎఫ్‌సీఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం న్యూ రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేసి, అవసరమైన వివరాలను అందించాలి.
* ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌ను నింపాలి. అనంతరం ఫోటో, సిగ్నేచర్‌ను అప్‌లోడ్ చేయాలి.
* చివరిగా ఫీజును చెల్లిస్తే సరిపోతుంది.