AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway Jobs: దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. 4,103 పోస్టుల భర్తీ, తెలుగు రాష్ట్రాల్లోనూ..

Indian Railway Recruitment 2021: దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 4103 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే..

Indian Railway Jobs: దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. 4,103 పోస్టుల భర్తీ, తెలుగు రాష్ట్రాల్లోనూ..
Sankranti Special Train
Narender Vaitla
|

Updated on: Oct 19, 2021 | 10:55 AM

Share

Indian Railway Recruitment 2021: దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 4103 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, నాందేడ్‌ రైల్వే డివిజన్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* మొత్తం 4103 ఖాళీలకు గాను కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్ లాంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) లేదా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ (SCVT) గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఐటీఐ పాస్ కావాలి.

* అభ్యర్థుల వయసు 04-10-2021 నాటికి 24 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది అప్రెంటీస్‌ ఉంటుంది. సెంట్రల్ అప్రెంటీస్‌షిప్ కౌన్సిల్ సిలబస్ ప్రకారం శిక్షణ ఉంటుంది. అప్రెంటీస్‌షిప్ రూల్స్ ప్రకారం స్టైపెండ్ లభిస్తుంది.

* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 03-11-2021ని నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

* దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Viral Video: ఇంటి వరండాలో ఊహించని సీన్.. చూసి షాకైన జనాలు.. వైరల్ వీడియో.!

Milk Benefits: మంచి నిద్రకు వేడిపాలు సహాయపడుతుందా? ఎందుకలా? పరిశోధకులు ఏమంటున్నారు? (వీడియో)

Watch Video: గబ్బర్ అవతారం ఎత్తిన టీమిండియా కెప్టెన్.. ఫన్నీ వీడియోతో నెట్టింట్లో నవ్వులు పూయిస్తోన్న విరాట్ కోహ్లీ