AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంజినీరింగ్, MBBSలో సీటు పొందిన విద్యార్థులకు తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్ధిక సాయం!

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరానికి ఐఐటీ, నీట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇంజినీరింగ్, మెడిసిన్‌లో సీట్లు సాధించిన ఎస్సీ గురుకుల విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. ఆయా విద్యార్ధులకు ప్రోత్సాహకంగా రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించాలని అధికారులను ఆదేశించారు..

ఇంజినీరింగ్, MBBSలో సీటు పొందిన విద్యార్థులకు తీపికబురు.. ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్ధిక సాయం!
financial incentive for engineering and MBBS students
Srilakshmi C
|

Updated on: Jul 11, 2025 | 8:26 AM

Share

అమరావతి, జులై 11: రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐఐటీ, నీట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇంజినీరింగ్, మెడిసిన్‌లో సీట్లు సాధించిన ఎస్సీ గురుకుల విద్యార్థులకు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి శుభవార్త చెప్పారు. ఆయా విద్యార్ధులకు ప్రోత్సాహకంగా రూ.లక్ష చొప్పున ఆర్థిక ప్రోత్సాహకం అందించాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని కార్యాలయంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు నిర్ణయాలు తీసుకున్నారు.

గురుకుల విద్యార్థులకు 11 కాస్మొటిక్‌ వస్తువులను కిట్‌ రూపంలో అందించాలని అధికారులకు తెలిపారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన 7 ఐఐటీ, నీట్‌ శిక్షణ కేంద్రాల్లో డిప్యుటేషన్‌పై అధ్యాపకులను నియమించాలనే నిర్ణయానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. గురుకులాల్లో మిగిలిపోయిన సీట్లకు స్పాట్‌ అడ్మిషన్లు చేపట్టాలని కూడా ఆయన తెలిపారు. మరోవైపు ఐఐటీ, నీట్‌లో కొద్దిలో సీటు కోల్పోయిన 120 మంది విద్యార్థులకు లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ప్రతి గురుకుల పాఠశాలలో వీడియో కాన్ఫరెన్స్‌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వినుకొండ గురుకుల విద్యార్థిని సంకీర్తన ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యార్ధిని కుటుంబానికి సాంత్వన పథకం కింద రూ.3 లక్షల చెక్కును మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అందించారు.

నేటితో ముగుస్తున్న ఈఏపీసెట్‌ వెబ్‌ ఆప్షన్లకు తుది గడువు

తెలంగాణ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ నేటితో ముగియనుందని ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన తెలిపారు. జులై 10 వరకు 74,542 మంది వెబ్‌ఆప్షన్లు పెట్టుకున్నారని ఆమె పేర్కొన్నారు. జులై 13లోపు మాక్‌ సీట్ల కేటాయింపు ఉంటుందని, ఆ తర్వాత విద్యార్థులు రెండు రోజులపాటు వెబ్‌ ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం ఇస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పెళ్లి కోసం వెయిటింగ్? ఈ 6 రాశులకు ఇక గుడ్ న్యూస్!
పెళ్లి కోసం వెయిటింగ్? ఈ 6 రాశులకు ఇక గుడ్ న్యూస్!
శాలరీ స్లిప్, సిబిల్ స్కోర్ లేకపోయినా పర్సనల్ లోన్ వస్తుందా..?
శాలరీ స్లిప్, సిబిల్ స్కోర్ లేకపోయినా పర్సనల్ లోన్ వస్తుందా..?
కలెక్టర్ ఉద్యోగాన్ని వదులుకుని సినిమాల్లోకి వచ్చిన నటుడు..
కలెక్టర్ ఉద్యోగాన్ని వదులుకుని సినిమాల్లోకి వచ్చిన నటుడు..
అరటి తోటలో అలికిడి.. అడుగు ముందుకేసిన రైతుకు ఎదురైన భయానక దృశ్యం!
అరటి తోటలో అలికిడి.. అడుగు ముందుకేసిన రైతుకు ఎదురైన భయానక దృశ్యం!
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!
సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా
సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా
డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు
డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు
మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..
మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..
పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని 'పొలం పచ్చడి'
పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని 'పొలం పచ్చడి'
ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మీరూ పొందోచ్చు..
ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మీరూ పొందోచ్చు..