AP Exams in March: మార్చి నెలంతా పరీక్షలే.. ఏయే తేదీల్లో ఏయే పరీక్షలు ఉంటాయో పూర్తి వివరాలు తెలుసుకోండి!

|

Feb 23, 2024 | 1:33 PM

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ఈ ఏడాది దాదాపు 16.75 లక్షల మంది హాజరవుతున్నారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 22న జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. టెట్‌, డీఎస్సీ పరీక్షలతో కలిపి మొత్తం 20 లక్షల మంది హాజరవుతారని, అధికారులందరూ సమన్వయంతో..

AP Exams in March: మార్చి నెలంతా పరీక్షలే.. ఏయే తేదీల్లో ఏయే పరీక్షలు ఉంటాయో పూర్తి వివరాలు తెలుసుకోండి!
AP Exams in March
Follow us on

అమరావతి, ఫిబ్రవరి 23: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ఈ ఏడాది దాదాపు 16.75 లక్షల మంది హాజరవుతున్నారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 22న జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. టెట్‌, డీఎస్సీ పరీక్షలతో కలిపి మొత్తం 20 లక్షల మంది హాజరవుతారని, అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని మంత్రి బొత్స పేర్కొన్నారు. పరీక్షా కేంద్రానికి 100 మీటర్ల సమీపంలో 144 సెక్షన్‌ అమలు చేయాలని ఆయన సూచించారు.

మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు

మార్చి 18 నుంచి 30 వరకు జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,23,092 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో బాలురు 3,17,939, బాలికలు 3,05,153 మంది ఉన్నారు. ఆయా పరీక్ష తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈసారి సామాన్యశాస్త్రంలో భౌతిక, రసాయన శాస్త్రాలకు పేపర్‌-1 కింద 50 మార్కులు, జీవశాస్త్రం పేపర్‌-2 కింద 50 మార్కులు కేటాయించి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షలు ఉదయం 9.30 నుంచి 11.30 వరకు జరుగుతాయి. వీరితో పాటు 1,02,528 మంది సప్లిమెంటరీ విద్యార్ధులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో అన్ని సబ్జెక్టులూ రాసేవారు 1,150 మంది ఉన్నారు. వీరు అన్ని సబ్జెక్టుల పరీక్షలు రాసినా గతంలో వచ్చిన మార్కుల కంటే ఎక్కువ వస్తేనే కొత్త మార్కులను కలుపుతారు. లేదంటే పాత వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. వీరికి కూడా రెగ్యులర్‌గా ఉత్తీర్ణులైనట్లు సర్టిఫికెట్‌ ఇస్తారు. ఫెయిల్‌ అయిన వారు పాస్‌ అయితే సప్లిమెంటరీ మెమో ఇస్తారు. ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టేందుకు వాటిపై కోడ్‌ నంబరుతో పాటు క్యూఆర్‌ కోడ్‌ను ముద్రిస్తున్నారు. విద్యార్థులు హాల్‌ టికెట్‌ చూపించి, ఆర్టీసీ బస్సులోఉచితంగా ప్రయాణం చేసే సదుపాయం ఇచ్చారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాల మూల్యాంకనం మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 8 వరకు జరుగుతుంది

మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియెట్‌ పరీక్షలు

మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి దాదాపు 10,52,221 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలకు హాజరు కానున్నారు. ఇక సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్‌ పరీక్షలు మార్చి 18 నుంచి 26 వరకు జరుగుతాయి. రోజూ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. 76,572 మంది పదో తరగతికి, 34,635 మంది ఇంటర్మీడియెట్‌కు హాజరు కానున్నారు. ఏపీ టెట్‌ 2,79,685 మంది రాయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.