EEMT 2024 Merit Test: ఈఈఎంటీ-2024కు 7వ, 10వ తరగతి విద్యార్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం..
ఎడ్యుకేషనల్ ఎపిఫనీ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ‘ఈఈఎంటీ–2024’ (ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్) కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఈఈఎంటీ షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మంగళవారం విడుదల చేశారు. విద్యార్థుల్లో ప్రతిభను పోత్సహించేందుకు ఈ పరీక్ష తోడ్పడుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో..
అమరావతి, డిసెంబర్ 27: ఎడ్యుకేషనల్ ఎపిఫనీ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ‘ఈఈఎంటీ–2024’ (ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్) కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ఈఈఎంటీ షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మంగళవారం విడుదల చేశారు. విద్యార్థుల్లో ప్రతిభను పోత్సహించేందుకు ఈ పరీక్ష తోడ్పడుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 7, 10 తరగతి విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకావచ్చన్నారు. గత 11 సంవత్సరాలుగా ఆన్‌లైన్‌లో ఎడ్యుకేషనల్ ఎపిఫనీ మెరిట్ టెస్ట్ నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. https:// educationalepiphany.org/eemt 2024/registration.php లింక్ ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.జనవరి 23న ప్రిలిమినరీ పరీక్ష, జనవరి 31న మెయిన్స్ పరీక్ష ఉంటుందన్నారు. ‘కోడ్ తంత్ర’ సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ఎక్కువ మంది విద్యార్థులు పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకునేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జనవరి 8వ తేదీ వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించారు. 7, 10 తరగతుల్లో డిసెంబర్ వరకు పూర్తయిన సిలబస్‌పై 80 శాతం ప్రశ్నలు, జనరల్ నాలెడ్జిపై మరో 20 శాతం ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో వస్తాయన్నారు. ఈ పరీక్షలో ప్రతిభకనబరచిన తొలి 162 మంది విజేతలకు రూ.9 లక్షల బహుమతులు అందజేస్తారని తెలిపారు.
మరో 1,752 మందికి మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. పదో తరగతిలో ప్రథమ బహుమతిగా రూ.30 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.25 వేలు, తృతీయ బహుమతిగా రూ.20 వేలు ప్రకటించారు. అదేవిధంగా ఏడో తరగతిలో రాష్ట్ర స్థాయి మొదటి విజేతకు రూ.20 వేలు, రెండో విజేతకు రూ.15 వేలు, మూడో విజేతకు రూ.10 వేల చొప్పున బహుమతిగా అందజేస్తారని తెలిపారు. ఈ పరీక్షకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ బి ప్రతాప్ రెడ్డి, ఎపిఫనీ సంస్థ ప్రతినిధి డి నభీ కోఆర్డినేటర్లుగాను, వి.ఎస్.సుబ్బారావు పరీక్షా కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో గాని, 96667 47996 నంబర్‌లోగాని సంప్రదించి తెలుసుకోవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.