Exams: ఈ ఏడాది బోర్డ్ ప‌రీక్ష‌ల‌పై క‌రోనా ప్ర‌భావం ఏ మేర ఉంటుంది.. సందిగ్ధంలో విద్యార్థులు..

|

Jan 17, 2022 | 8:10 PM

Exams: క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన‌ట్లే విద్యా రంగంపై కూడా ప్ర‌తికూల ప్ర‌భావం చూపింది. చ‌రిత్రలో ఎన్న‌డూ లేని విధంగా ఏకంగా రెండు అక‌డ‌మిక్ ఇయ‌ర్‌లు ప్ర‌శ్నార్థ‌కంగా మారాయి. ప‌రీక్ష‌లు లేకుండానే విద్యార్థుల‌ను...

Exams: ఈ ఏడాది బోర్డ్ ప‌రీక్ష‌ల‌పై క‌రోనా ప్ర‌భావం ఏ మేర ఉంటుంది.. సందిగ్ధంలో విద్యార్థులు..
Inter Exams
Follow us on

Exams: క‌రోనా మ‌హ‌మ్మారి అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన‌ట్లే విద్యా రంగంపై కూడా ప్ర‌తికూల ప్ర‌భావం చూపింది. చ‌రిత్రలో ఎన్న‌డూ లేని విధంగా ఏకంగా రెండు అక‌డ‌మిక్ ఇయ‌ర్‌లు ప్ర‌శ్నార్థ‌కంగా మారాయి. ప‌రీక్ష‌లు లేకుండానే విద్యార్థుల‌ను పై త‌ర‌గ‌తికి ప్ర‌మోట్ చేయ‌డంతో చ‌దువుల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంద‌ని కొంద‌రు వాధిస్తున్నారు. అయితే విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఇది త‌ప్ప‌ద‌నేది మ‌రికొంద‌రి వాద‌న‌. ఇదిలా ఉంటే సెకండ్ త‌ర్వాత ప‌రిస్థితులు మెరుగ‌య్యాయ‌ని అంద‌రూ సంతోషించారు. విద్యా సంస్థ‌ల‌కు కూడా ఎప్ప‌టిలాగే ప్రారంభ‌మ‌య్యాయి. ఇక చ‌దువులు మ‌ళ్లీ గాడిన ప‌డుతున్నాయ‌ని అంద‌రూ అనుకుంటున్న స‌మ‌యంలోనే థార్డ్ వేవ్ రూపంలో మ‌రో విప‌త్తు ముంచుకొచ్చింది.

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా కేసులు ఓ రేంజ్‌లో దూసుకుపోతున్నాయి. ఇప్ప‌టికే రోజువారి కేసులు ఏకంగా 2 ల‌క్ష‌ల 70 వేలు చేరింది. దీంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థ‌ల‌ను మూసివేశారు. ప్ర‌స్తుతం ఆన్‌లైన్ విధానంలో త‌ర‌గ‌తులు సాగుతున్నాయి. అయితే ఈ ఏడాది బోర్డ్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై మ‌రోసారి సందిగ్ధ‌త మొద‌లైంది. అయితే అన్ని రాష్ట్రాల బోర్డ్‌లు మాత్రం 2022లో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించేందుకే మొగ్గు చూపుతున్నాయి. పరీక్ష‌ల‌ను వాయిదా వేయ‌డం క‌ష్ట‌మ‌నే అభిప్రాయంలో ఉన్నాయి. దీంతో టెన్త్, ఇంట‌ర్ లాంటి బోర్డ్ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అవుతున్న‌వారిలో ప‌రీక్ష‌ల‌పై ప్ర‌శ్న‌లు మొద‌ల‌య్యాయి. దీంతో కొంద‌రు ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాల‌ని, లేదా ర‌ద్దు చేయాల‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. సాధార‌ణంగా మార్చిలో బోర్డ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. అయితే క‌రోనా ప్ర‌భావం వ‌చ్చే నెల‌లో ఇంకా పెరిగే అవ‌కాశాలున్నాయని నిపుణులు చెబుతున్న నేప‌థ్యంలో ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై అనుమానాలు మొద‌ల‌య్యాయి.

అయితే ఇప్ప‌టికే 15 నుంచి 18 ఏళ్ల చిన్నారుల‌కు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. మ‌రో నెల రోజుల్లో ఈ ప్ర‌క్రియ పూర్తికానుంది. అంతేకాకుండా ఫిబ్ర‌వ‌రి మ‌ధ్య‌లో క‌రోనా కేసులు గ‌రిష్ట స్థాయికి చేరుకొని వెంట‌నే త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ని నిపుణులు చెబుతున్నారు. బోర్డ్‌లు ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయ‌క‌పోవ‌డానికి ఇది కూడా ఒక కార‌ణంగా చెబుతున్నారు. ఇప్ప‌టికే మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్‌, అస్సాం బోర్డ్‌లు షెడ్యూల్ ప్ర‌కార‌మే ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని తెలిపాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కే బోర్డులు మొగ్గు చూపుతున్నాయి. అయితే చిన్నారలంద‌రికీ టీకా ప్ర‌క్రియ పూర్త‌య్యేవ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేసే అవ‌కావంశం ఉంద‌ని తెలుస్తోంది. కానీ టీకాలు వేసినా కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగితే మాత్రం ప‌రీక్ష‌ల‌ను నెల రోజుల కంటే ఎక్కువ వాయిదా వేయ‌డం కుద‌ర‌ద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Also Read: Covid Vaccine: వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో కేంద్రం మ‌రో ముంద‌డుగు.. 12-14 ఏళ్ల వారికి టీకాలు.. ఎప్ప‌టి నుంచంటే..

CM KCR tour: రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. వర్షానికి దెబ్బతిన్న పంటల పరిశీలన!

IPL 2022: గాయంతో కెప్టెన్సీ పోయింది.. తిరిగొచ్చినా సారథిగా ఛాన్స్ దక్కలే.. అద్భుత ఫాంతో కోట్లు కురిపించనున్న ప్లేయర్..!