DRDO Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) ఇంజినీరింగ్ విద్యార్థులకు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డీఆర్‌డీఓ చాందిపూర్ (బాలాసోర్)లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) కింద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) – 05 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇనుస్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగులను తీసుకోనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతో పాటు వాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి.
* దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు.. 09.07.2021 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* వివరాలను hrd@itr.drdo.in మెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది.
* షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపి చేస్తారు.
* దరఖాస్తులకు చివరి తేదీగా 09-01-2021ని నిర్ణయించారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీని ప్రకటించాల్సి ఉంది.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి…
Also Read: Gold Wing Tour Bike:హోండా నుంచి సరికొత్త బైక్.. ధర రూ.37.2 లక్షలు.. అదిరిపోయే ఫీచర్స్
WTC Final: అయ్యో.. ఆ రోజు వర్షం పడితే..! టెస్టు ఛాంపియన్‌షిప్‌లో విజేత ఎవరు..!