Chittoor Backlog Jobs 2023: చిత్తూరు జిల్లాలో బ్యాక్‌లాగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..

|

May 08, 2023 | 9:22 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లాలో 2023-24 సంవత్సరానికి సంబంధించి బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు..

Chittoor Backlog Jobs 2023: చిత్తూరు జిల్లాలో బ్యాక్‌లాగ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..
Andhra Pradesh
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన చిత్తూరు జిల్లాలో 2023-24 సంవత్సరానికి సంబంధించి బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు టైపిస్ట్‌ పోస్టులకైతే ఏదైనా డిగ్రీతో పాటు తెలుగులో టైప్‌రైటింగ్‌ హయ్యర్‌ గ్రేడ్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఇతర పోస్టులకు పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, ఎంపీహెచ్‌ఏ (ఎం) కోర్సు, ఇంటర్ ఒకేషనల్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ-ఎం), డిప్లొమా (సివిల్ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: జులై 1, 2023వ తేదీ నాటికి 18 నుంచి 52 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో మే 15, 2023వ తేదీలోపు కింది అడ్రస్‌లో దరఖాస్తులు అందజేయాలి. వయస్సు, వైకల్యం తీవ్రత, ఎంప్లాయిమెంట్‌ సీనియారిటీ ఆధారంగా ఎంపిక చేస్తారు. టైపిస్ట్‌ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(పురుషుడు) పోస్టులు: 1
  • జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు: 1
  • ఫౌంటెన్ క్లీనర్ పోస్టులు: 1
  • బోర్ వెల్ క్లీనర్ పోస్టులు: 1
  • వాచ్‌మెన్ పోస్టులు: 1
  • టీసీ పోస్టులు: 1
  • టైపిస్ట్‌ పోస్టులు: 2

అడ్రస్..

అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, అంబేడ్కర్ భవన్, న్యూ కలెక్టరేట్, చిత్తూరు.

ఇవి కూడా చదవండి

టైపిస్ట్ నోటిఫికేషన్‌ కోసం క్లిక్ చేయండి.

ఇతర పోస్టుల నోటిఫికేషన్‌ కోసం క్లిక్ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.