AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE, JEE, NEET: జేఈఈ, నీట్ ప‌రీక్ష‌లు, సీబీఎస్ఈ ఫ‌లితాలు.. విద్యార్థుల‌తో కేంద్ర‌మంత్రి పంచుకున్న విష‌యాలు..

CBSE, JEE, NEET Update: క‌రోనా కార‌ణంగా విద్యా వ్య‌వ‌స్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ నేప‌థ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ క్ర‌మంలోనే విద్యార్థుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్రం...

CBSE, JEE, NEET: జేఈఈ, నీట్ ప‌రీక్ష‌లు, సీబీఎస్ఈ ఫ‌లితాలు.. విద్యార్థుల‌తో కేంద్ర‌మంత్రి పంచుకున్న విష‌యాలు..
Neet Jee Cbse Updates
Narender Vaitla
|

Updated on: Jun 25, 2021 | 6:39 PM

Share

CBSE, JEE, NEET Update: క‌రోనా కార‌ణంగా విద్యా వ్య‌వ‌స్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ నేప‌థ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నాయి. ఈ క్ర‌మంలోనే విద్యార్థుల భ‌ద్ర‌త‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్రం సీబీఎస్ఈ 12వ త‌ర‌గతి ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేసింది. ఇంట‌ర్న‌ల్ మార్కుల ఆధారంగా విద్యార్థుల‌కు మార్కుల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు బోర్డు ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఇందుకోసం పాఠ‌శాలల ప్రిన్సిపాల్‌ల అధ్య‌క్ష‌త‌న ఓ క‌మిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలోనే సీబీఎస్ఈ ప‌రీక్ష ఫ‌లితాలు, జేఈఈ, నీట్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై విద్యార్థుల్లో ఇంకా ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతూనే ఉన్నాయి. దీంతో విద్యార్థుల్లో నెల‌కొన్న సందేహాల‌ను నివృత్తి చేసేందుకుగాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేష్ పోక్రియాల్‌ నిశాంక్ విద్యార్థుల‌తో వ‌ర్చువ‌ల్‌గా మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా విద్యార్థులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధాన‌మిస్తూ.. `ఇంట‌ర్న‌ల్ మార్కుల‌తో సంతృప్తి చెంద‌ని విద్యార్థుల‌కు ఆగ‌స్టులో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. ఇక ఇంట‌ర్న‌ల్ మార్కుల ఆధారంగా ఫ‌లితాల‌ను సిద్ధం చేయాల‌ని పాఠ‌శాల‌ల‌ను సీబీఎస్ఈ ఇప్ప‌టికే కోరింద‌న్నారు. పాఠశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ ఐటి బృందాల సహాయంతో ఫ‌లితాల‌ను సిద్ధం చేసి అప్‌లోడ్ చేస్తుందని మంత్రి తెలిపారు. సీబీఎస్ఈ ప‌రీక్షా ఫ‌లితాలను జూలై 31లోపు ప్ర‌క‌టించ‌నున్నారు. రాత పరీక్ష‌కు హాజ‌రు కావాల‌నుకునే వారు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ cbse.nic.in లో రిజిస్టార్ చేసుకోవాల్సి ఉంటుంద‌ని తెలిపారు. ఇక జేఈఈ, నీట్ ప‌రీక్ష‌లు ఎప్పుడు నిర్వ‌హిస్తార‌ని విద్యార్థులు అడిగిన ప్ర‌శ్న‌కు మాత్రం మంత్రి స‌మాధానం ఇవ్వ‌లేదు. బ‌హుశా ప‌రిస్థితులు మ‌రింత మెరుగ‌య్యాక ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశ‌మున్న‌ట్లు స‌మాచారం.

Also Read: SBI Recruitment 2021: స్టేట్‌ బ్యాంక్‌ ఆప్‌ ఇండియాలో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేది జూన్‌ 28

JNTU Exams: జులైలో బీటెక్‌, బీఫార్మసీ పరీక్షలు.. షెడ్యూల్‌ విడుదల చేసిన హైదరాబాద్ జేఎన్‌టీయూ..

MCTE Recruitment: మిలిట‌రీ కాలేజ్ ఆఫ్ టెలీక‌మ్యూనికేష‌న్ ఇంజ‌నీరింగ్‌లో ఉద్యోగాలు.. ఎవ‌రు అప్లై చేసుకోవ‌చ్చంటే.. 

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు