CBSE Exams: కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థను ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి రెండు వేవ్‌ల కారణంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సిలబస్ ఎడ్యుకేషన్ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే 2021-2020 అకాడమిక్ ఇయర్‌కు గాను రెండు బోర్డ్ ఎగ్జామ్‌లను నిర్వహించాలని ఆలోచిస్తోంది. ఇకే బోర్డ్ ఎగ్జామ్ ఉండడం వల్ల పరీక్షలు రద్దు వంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి రెండు బోర్డ్ ఎగ్జామ్స్‌ను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
టర్మ్1, టర్మ్ 2 పేరుతో ఈ పరీక్షలను నిర్వహించాలని బోర్డ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా ఒకే ఏడాది రెండు బోర్డు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను విడదుల చేస్తారు. ఇక సిలబస్ విషయానికొస్తే.. రెండు టర్ముల్లో సిలబస్ వేరు వేరుగా ఉంటుంది. మొదటి టర్మ్ పరీక్షను 50 శాతం సిలబస్‌తో రెండవ టర్మ్ పరీక్షను మిగతా 50 శాతం సిలబస్‌తో నిర్వహిస్తారు. పరీక్షల సమయాన్ని 90 నిమిషాలుగా నిర్ణయించారు. బోర్డు నియమించిన అధికారుల సమక్షంలోనే ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఇక మొదటి టర్మ్ పరీక్షను నవంబరు – డిసెంబర్ మధ్య కాలంలో, రెండవ టర్మ్ పరీక్షను మార్చి-ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. పరీక్ష విధానంతో పాటు పరీక్ష పేపర్‌ను కూడా మార్చనున్నారు. మొదటి టర్మ్ ఫస్ట్ పేపర్‌లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. అలాగే సెకండ్ పేపర్‌లో విభిన్న రకమైన ప్రశ్నలు ఇస్తారు. దీనికి అనుగుణంగానే సిలబస్‌ను కూడా రూపొందించనున్నారు. మరి సీబీఎస్‌ఈ తీసుకురావాలని భావిస్తోన్న ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందో లేదో చూడాలి.
Also Read: Covid Victims Park: కోవిడ్ మృతుల స్మారక కట్టడం.. పార్కును నిర్మించే పనిలో రాష్ట్ర సర్కార్..