Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? నేటితో ముగుస్తున్న గడువు..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న బ్రాంచ్‌ల్లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయడానికి గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 110 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 28-09-2022 తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ..
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఉన్న బ్రాంచ్‌ల్లో ఉన్న పలు ఖాళీలను భర్తీ చేయడానికి గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా పలు విభాగాల్లో ఉన్న మొత్తం 110 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 28-09-2022 తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ నేటితో (సోమవారం) ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 110 ఖాళీలు ఉన్నాయి.
* వీటిలో ఐటీ (33), ఎకనామిస్ట్ (03), డేటా సైంటిస్ట్ (01), రిస్క్ మేనేజర్ (21), ఐటీ ఎస్‌ఓసీ అనలిస్ట్ (01), ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్ (01), టెక్నికల్ ఆఫీసర్(క్రెడిట్) (15), క్రెడిట్ ఆఫీసర్ (08), డేటా ఇంజినీర్ (09), లా ఆఫీసర్ (05), సెక్యూరిటీ (05), ఫైనాన్షియల్ అనలిస్ట్ (08) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో సీఏ, సీఎఫ్‌ఏ, ఏసీఎంఏ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు సోమవారం (17-10-2022) చివరి తేదీగా నిర్ణయించారు.
* ఇంటర్వ్యూలను 2022 డిసెంబర్‌లో నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..