Bank Recruitment 2021: సెంట్రల్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. అర్హతలు.. పూర్తి వివరాలు..!
Bank Recruitment 2021: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడుతున్నాయి. ఇక బ్యాంకింగ్..
Bank Recruitment 2021: ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడుతున్నాయి. ఇక బ్యాంకింగ్ రంగలో కూడా భారీగానే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడుతున్నాయి. ఇక తాజాగా సెంట్రల్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 23న ప్రారంభం కానుంది. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 17. అయితే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 22న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు. మొత్తం 115 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎకనామిస్ట్ , ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైంటిస్ట్, క్రెడిట్ ఆఫీసర్, డేటా ఇంజనీర్, ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్, ఐటీ అనలిస్ట్, రిస్క్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ఫైనాన్షియల్ అనలిస్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా ఆఫీసర్, రిస్క్ మేనేజర్, సెక్యూరిటీ II, సెక్యూరిటీ I పోస్టులు ఉన్నాయి.
అర్హతలు:
పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, ఎంబీఏ, మాస్టర్ డిగ్రీ, సీఏ, సీఎఫ్ఏ, పీహెచ్‌డీ చేసిన అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫీజు రూ. 850 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 23, 2021 దరఖాస్తుకు చేవరి తేదీ: డిసెంబర్ 17, 2021 అడ్మిట్ కార్డులు విడుదల: జనవరి 11, 2021 పరీక్ష తేదీ: జనవరి 22, 2021 పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://centralbankofindia.co.in/
ఇవి కూడా చదవండి: