BITSAT 2021: ప్రవేశ పరీక్షలపై కోవిడ్ ప్రభావం.. బిట్‌శాట్ 2021 ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాయిదా
BITSAT 2021 postpones: బిట్‌శాట్ 2021 ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్) పిలానీ ఈ కీలక నిర్ణయం తీసకుంది. పరీక్ష జూన్ 24 నుండి 29వ....
ప్రవేశ పరీక్షలపై కోవిడ్ ప్రభావం పడటంతో బిట్‌శాట్ 2021 ప్రవేశ పరీక్ష వాయిదా పడింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్) పిలానీ ఈ కీలక నిర్ణయం తీసకుంది. పరీక్ష జూన్ 24 నుండి 29వ తేదీ మధ్యలో జరగాల్సి ఉంది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో తాజాగా విశ్వ విద్యాలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షల జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. పరీక్షల తేదీలను జూన్‌లో యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఈ వివరాలను ప్రకటిస్తామని తెలిపింది.
ఈ క్రమంలో దరఖాస్తు గడువు తేదీని పొడిగించింది. జూన్ 30 సాయంత్రం 5 గంటల సమయాన్ని ఇచ్చినట్లుగా పేర్కొంది. ఈ వివరాలను అధికారిక వెబ్‌సైట్ bitsadmission.com లో చూాడాలని కోరింది. దరఖాస్తుకు సంబంధించిన వివరాలను వెల్లడిచింది. అభ్యర్థులకు రూ.3,400, మహిళా అభ్యర్థులకు రూ.2,900గా ఉంది. అదే దుబాయ్‌లో పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులకు దరఖాస్తు రుసుము రూ. 7 వేలు. బిట్స్, పిలాని, గోవా, హైదరాబాద్‌లోని క్యాంపస్‌లలో ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం బిట్‌షాట్ జరుగుతుంది.
దరఖాస్తుదారులు ఈ దశలను అనుసరించవచ్చు:
- సందర్శించండి https://bitsadmission.com/
- హోమ్‌పేజీలో, నోటీసును తనిఖీ చేసి, నమోదు చేయడానికి ‘ఇక్కడ క్లిక్ చేయండి’ https://bitsadmission.com/ లింక్‌ను క్లిక్ చేయండి
- రిజిస్ట్రేషన్ ఫారమ్ నింపండి
- రిజిస్ట్రేషన్ తరువాత, అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ మరియు ఇమెయిల్ ఐడిని ఉపయోగించి లాగిన్ అవ్వండి
- దరఖాస్తు ఫారమ్ నింపండి. మీకు నచ్చిన కనీసం మూడు పరీక్షా కేంద్రాలను ఎంచుకోండి
- అన్ని పత్రాలు, తాజా స్కాన్ చేసిన పాస్ ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి
- ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించండి
- కాపీని సేవ్ చేయండి. భవిష్యత్ సూచన కోసం ఫారం యొక్క ప్రింటౌట్ తీసుకోండి