బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ పరిధిలోని న్యూఢిల్లీ, కోల్‌కతా, కొయంబత్తూరులోని ఏఏఐ కార్గో లాజిస్టిక్ అండ్ అల్లాయిడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్‌లో.. సీనియర్ అకౌంట్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్, సూపర్‌వైజర్, హ్యాండిమ్యాన్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆపరేటర్, కార్గో, హెచ్‌ఆర్, పేరోల్, అకౌంట్ రిసివెబుల్స్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/బీకామ్/ఎంబీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 30 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో జనవరి 27, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఓబీసీ/ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ అభ్యర్ధులు రూ.885, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీహెచ్ అభ్యర్ధులు రూ.531లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.17,446ల నుంచి రూ.35,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.