BARC-NRB Group ‘C’ Non Gazetted Recruitment 2022: భారత ప్రభుత్వ ఆణుశక్తి విభాగానికి చెందిన ముంబాయి ప్రధానకేంద్రంగా ఉన్న భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) ఆధ్వర్యంలోని న్యూక్లియర్ రీసైకిల్ బోర్డు.. గ్రూప్ ‘సీ’ నాన్ గెజిటెడ్ (Group ‘C’ Non Gazetted Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్ధులు కల్పక్కం, తారాపూర్, ముంబయి బోర్డుల్లో పని చేయవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 89
పోస్టుల వివరాలు:
విభాగాలు: రేడియాలజీ, ఈఎన్‌టీ, అనెస్తీషియా, అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆప్తల్మాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.18,000ల నుంచి రూ. 25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టులును బట్టి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. డ్రైవర్ పోస్టులకు వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటార్ మెకానిజం కూడా తెలిసి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జులై 1, 2022.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 31, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చెయ్యండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.