Bank Jobs: డిగ్రీ అర్హ‌త‌తో బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌..

| Edited By: Ravi Kiran

Jan 15, 2022 | 7:09 AM

Bank Of Baroda Recruitment: బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భారత ప్ర‌భుత్వ రంగ బ్యాంక్ అయిన ఈ సంస్థ‌లో ప‌లు విభాగాల్లో ఉన్న ఖాళీల‌ను కాంట్రాక్ట్ విధానంలో భ‌ర్తీ చేయ‌నున్నారు...

Bank Jobs: డిగ్రీ అర్హ‌త‌తో బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌..
Follow us on

Bank Of Baroda Recruitment: బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భారత ప్ర‌భుత్వ రంగ బ్యాంక్ అయిన ఈ సంస్థ‌లో ప‌లు విభాగాల్లో ఉన్న ఖాళీల‌ను కాంట్రాక్ట్ విధానంలో భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిపికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లోభాగంగా మొత్తం 198 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* వీటిలో క్యాష్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం (53), రిసీవబుల్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం (145) ఖాళీలు ఉన్నాయి.

* అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్, హెడ్‌ స్ట్రాటజీ, వెండర్‌ మేనేజర్‌, ఎంఐఎస్‌ మేనేజర్‌, ప్రాసెస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా ఏదైనా గ్రాడ్యుయేషన్‌, బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ సీఏ/ పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి.

* వీటితో పాటు సంబంధిత ప‌నిలో అనుభ‌వం, బ్యాంకింగ్‌, టెక్నికల్‌ నాలెడ్జ్ త‌ప్ప‌నిస‌రి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు పోస్టుల ఆధారంగా 25 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థుల‌ను ముందుగా అక‌డ‌మిక్‌, ప‌ని అనుభ‌వం ఆధారంగా షార్ట్ లిస్టింగ్ చేస్తారు. అనంత‌రం ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* 12-02-2022న మొద‌లైన ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌.. 01-02-2022తో ముగియ‌నుంది.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Paytm Shut Down: ఇక నుంచి పేటీఎం యాప్‌ సేవలు నిలిపివేత.. ఎక్కడో తెలుసా..?

Will Writing: వీలునామా రాస్తున్నారా..? గుర్తించుకోవాల్సిన విషయాలు ఇవే…!