APVVP Kurnool Recruitment 2022: టెన్త్/ఇంటర్ అర్హతతో నెలకు రూ.52,000లు సంపాదించే అవకాశం.. కర్నూలు జిల్లాలో..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP), కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Kurnool District).. ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన..
APVVP Kurnool District Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP), కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Kurnool District).. ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 10
పోస్టుల వివరాలు:
- రేడియోగ్రాఫర్ పోస్టులు: 2
- కౌన్సెలర్ పోస్టులు: 3
- బయోమెడికల్ ఇంజనీర్ పోస్టులు: 1
- ఎలక్ట్రీషియన్ పోస్టులు: 2
- ప్లంబర్ పోస్టులు: 1
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్: నెలకు రూ.18,500ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, బీఏ, బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవంతోపాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: District Coordinator of Hospital Services (APVVP), Nandyala, Kurnool District, AP.
దరఖాస్తు రుసుము:
- జనరల్ అభ్యర్ధులకు: రూ. 500
- ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ. 300
- వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: