APPSC Lecturer Hall Ticket 2023: ఈనెల 28 నుంచి లెక్చరర్‌ పోస్టులకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌.. పరీక్ష తేదీ ఇదే..

|

Dec 25, 2023 | 1:44 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల హాల్‌టికెట్లు డిసెంబర్‌ 28 నుంచి కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్ధుల వివరాలను నమోదు చేసి హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. జనవరి 4న ఈ పరీక్ష జరగనుంది..

APPSC Lecturer Hall Ticket 2023: ఈనెల 28 నుంచి లెక్చరర్‌ పోస్టులకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌.. పరీక్ష తేదీ ఇదే..
APPSC
Follow us on

అమరావతి, డిసెంబర్‌ 25: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన కంప్యూటర్‌ ఆధారిత పరీక్షల హాల్‌టికెట్లు డిసెంబర్‌ 28 నుంచి కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్ధుల వివరాలను నమోదు చేసి హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. జనవరి 4న ఈ పరీక్ష జరగనుంది.

డిసెంబర్‌ 28, 29 తేదీల్లో తెలంగాణ పారామెడికల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణ

తెలంగాణ రాష్ట్ర పారామెడికల్‌ బోర్డు ఆదేశాల మేరకు పారామెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వరంగల్‌ కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ మోహన్‌దాస్‌ శనివారం తెలిపారు. డిసెంబరు 28, 29 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కళాశాల ఆడిటోరియంలో కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కౌన్సెలింగ్‌కు వచ్చే సమయంలో ధ్రువపత్రాలను తీసుకురావాలని సూచించారు.

రాత పరీక్ష లేకుండానే రైల్వేలో 7,893 అప్రెంటిస్‌లకు నోటిఫికేషన్లు

దేశవ్యాప్తంగా వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి సంబంధించి రైల్వే నియామక సంస్థలు ఇటీవల వరుస ప్రకటనలు జారీ చేశాయి. తాజాగా సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే జోన్‌లో- 1785, నార్తెర్న్‌ రైల్వే జోన్‌లో- 3093, వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే జోన్‌లో- 3015 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతున్నాయి. పదో తరగతి, ఐటీఐ కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు సంబంధిత నోటిఫికేషన్లలో తెల్పిన తేదీల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే పదో తరగతి, ఐటీఐ మార్కులు, రిజర్వేషన్‌, ధ్రువ పత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.