APPSC Group 2 Result Date: ప్రశాంతంగా ముగిసిన ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్ష.. ఫలితాలు ఎప్పుడంటే?

|

Mar 01, 2024 | 9:46 AM

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఆదివారం (ఫిబ్రవరి 25) నిర్వహించిన గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 24 జిల్లాల్లో 1,327 సెంటర్లలో ఈ పరీక్ష జరిగింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోగా పరీక్షకు..

APPSC Group 2 Result Date: ప్రశాంతంగా ముగిసిన ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్ష.. ఫలితాలు ఎప్పుడంటే?
APPSC Group 2
Follow us on

అమరావతి, ఫిబ్రవరి 26: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఆదివారం (ఫిబ్రవరి 25) నిర్వహించిన గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 24 జిల్లాల్లో 1,327 సెంటర్లలో ఈ పరీక్ష జరిగింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోగా పరీక్షకు మాత్రం 87.17 శాతం మంది హాజరయ్యారు. ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన పరీక్షలకు గరిష్టంగా 68 నుంచి 70 శాతం వరకు మాత్రమే హాజరయ్యేవారు. ఈ రికార్డులను బద్దలు కొడుతూ ఈసారి గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ పరీక్షకు అత్యధికంగా హాజరవడం విశేషం.

కాగా రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 897 పోస్టుల భర్తీకి ఎపీపీఎస్సీ గ్రూప్‌ 2 నియామక పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష తీరును ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ పర్యవేక్షించారు. ఎక్కడా మాల్‌ ప్రాక్టీస్‌ నమోదు కాలేదని అయన చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఫేక్‌ అడ్మిట్‌ కార్డుతో ఓ వ్యక్తి పరీక్షకు హాజరుకాగా అతన్ని పట్టుకున్నామని అన్నారు. నకిలీ హాల్‌టికెట్‌ తయారు చేసిన వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల అనంతరం జూన్‌ లేదా జులైలో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు వెలువరిస్తామని ఆయన అన్నారు. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 పరీక్ష మార్చి 17న ఉంటుందని, వాయిదా వదంతులు నమ్మకుండా పరీక్షకు సిద్ధం కావాలని గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు.

AISSEE 2024 ప్రవేశ పరీక్ష కీ విడుదల.. అభ్యంతరాలకు గడువు ఫిబ్రవరి 27

సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష ప్రాధమిక ఆన్సర్ ‘కీ’ ఆదివారం (ఫిబ్రవరి 25) విడుదలైంది. ఈ ఏడాది జనవరి 28న దేశ వ్యాప్తంగా పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి ఆన్సర్ కీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 27వ తేదీలోగా కీపై అభ్యంతరాలకు తెలియజేయవచ్చు. కాగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33 సైనిక స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరానికి గానూ 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024) నిర్వహించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024 కీ అభ్యంతరాల నమోదు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.