AP Police Constable Hall Tickets: కానిస్టేబుల్ శారీర సామర్థ్య పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మార్చి 13 నుంచి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్/ ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ జరుగనున్నాయి. శారీరక సామర్థ్య పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫలితాలు ఫిబ్రవరి 5న విడుదలయ్యాయి. దాదాపు 95,209 మంది అభ్యర్ధులు తరువాత దశకు అర్హత సాధించారు. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారిలో 77,876 మంది పురుషులు, 17,332 మంది మహిళలు ఉన్నారు. వీరందరికీ మార్చి 13 నుంచి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్/ ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ జరుగనున్నాయి. శారీరక సామర్థ్య పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు మార్చి 1న విడుదలయ్యాయి.
ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు మార్చి 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. శారీరక సామర్థ్య పరీక్షల అనంతరం అర్హత సాధించిన వారికి ఏప్రిల్ చివరి వారంలో మెయన్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెల్పింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.