AP Polycet results: ఏపీ పాలిసెట్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ ఇలా సింపుల్ గా చెక్ చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్‌లో పాలిసెట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఉదయం రాష్ట్ర ఆర్థిఖ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఏపీలో ఈ నెల 10వ తేదీన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్-2023)ను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా...
ఆంధ్రప్రదేశ్‌లో పాలిసెట్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం ఉదయం కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐఏఎస్ సి .నాగరాణి ఫలితాలను విడుదల చేశారు. ఈసారి పాలీసెట్‌లో మొత్తం 1,24,021 మంది అర్హత సాధించారు. మొత్తం పాస్ పర్సెంటేజ్ 86.5 శాతంగా ఉంది. ఇక వీరిలో అమ్మాయిల పాస్ పర్సంటేజ్ 88.90 శాతం కాగా, అబ్బాయిల పాస్ పర్సంటేజ్ 84.74గా నమోదైంది. ఇదిలా ఉంటే 15 మంది విద్యార్థులు 120 కి 120 మార్కులు సాధించారు. వీరంతా ఉభయగోదావరి జిల్లా విద్యార్థులే కావడం విశేషం.
ఏపీలో ఈ నెల 10వ తేదీన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్-2023)ను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 87 ప్రభుత్వ, 171 ప్రైయివేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 29 బ్రాంచ్‌లలో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,59,144 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా 1,43,625 మంది పరీక్షకు హాజరయ్యారు.
దరఖాస్తు చేసుకున్న వారిలో 96429 మంది బాలురు, 62715 మంది బాలికలు ఉన్నారు. ఇక పాలీసెట్ లో అభ్యర్థులు సాధించిన ప్రతిభ ఆధారంగా వారికి సీట్లను కేటాయించనున్నారు. పాలిసెట్ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లను నిర్వహించనున్నారు.
ఏపీ పాలిసెట్ 2023 రిజల్ట్స్ ఇక్కడ తెలుసుకోండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..