ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (ఏపీ ఐసెట్) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఐసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు రిజిస్ట్రేషన్ నంబర్ లేదా డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 24, 25 తేదీల్లో రోజుకు 2 షిఫ్టుల ప్రకారం ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. ఈ పరీక్షను శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్యర్యంలో జరగనున్నాయి. ఈ మేరకు విద్యార్ధులకు తెలియజేస్తూ ప్రకటన వెడుదల చేశారు.
కాగా ఏపీ ఐసెట్‌లో వచ్చిన ర్యాంకు ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి గానూ ఏపీలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(ఎంసీఏ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
అలాగే ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ-2023 పరీక్షల హాల్‌టికెట్లు కూడా విడుదలయ్యాయి. జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో కాలేజీల ప్రిన్సిపాళ్లు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసి, విద్యార్థులకు అందించాలని ఇంటర్ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు సూచించారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.